నాని సరసన అదితి.. మల్టీస్టారర్‌లో ఛాన్స్!
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు మైత్రి మూవీస్ నిర్మాణంలో, విక్రమ్ కుమార్ దర్శత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రారంభమైపోయింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు జెంటిల్ మ్యాన్ లాంటి హిట్ అందించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో నాని మరోమారు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో నానికి జోడిగా అదితి రావు హైదరి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదితి రావు హైదరి ఇంద్రగంటి తెరెకెక్కించిన సమ్మోహనం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ అతిదినే రిపీట్ చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడట. ఈ చిత్రం మల్టీస్టారర్ గా రూపొందనుందని, మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఆ మరో హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం నాని నటిస్తున్న జెర్సీ చిత్రం ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటిస్తున్న గ్యాంగ్ లీడర్ ఓ కొలిక్కి వచ్చాక ఇంద్రగంటి చిత్రాన్ని నాని ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











