‘జైల్’లో అదితి రావు హైదరీ ఇష్టమైన పని.. ఏం చేశారంటే..
విలక్షణ నటి అదితి రావు హైదరీ మరో కొత్త అవతారం ఎత్తారు. చెలియా, నవాబు లాంటి చిత్రాల్లో ఇప్పటి వరకు అద్బుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకొంటున్న ఈ అందాల భామ తాజాగా గాయనిగా మారారు. గతంలో పలు ఇంటర్వ్యూలో తన గాన ప్రతిభతో ఆకట్టుకొన్న అదితి రావు గాయనిగా మారారు. వివరాల్లోకి వెళితే ..
జైల్ చిత్రంలో పాట
అదితి రావు హైదరీతో పాట పాడించిన విషయాన్ని జీవి ప్రకాశ్ ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు జైల్ అను చిత్రంలో అదితి పాటపడింది అని పేర్కొన్నారు. అదితితో పాట పాడించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

భయపడుతూ పాట పడాను..
గాయనిగా మారిన అదితి కూడా తన తొలి అనుభవాన్ని అభిమానులతో పంచుకొన్నారు. నా తొలిపాట తమిళంలో రికార్డ్ అయింది. పాట పడేంత సేపు కడుపులో భయం వెంటాడింది. నాపై నమ్మకం ఉంచి ఓ అందమైన పాటను పాడించిన జీవి ప్రకాశ్‌కు చాలా థ్యాంక్స్. వసంత బాలన్ సార్ ఆల్ ది బెస్ట్ అని అదితి ట్వీట్ చేశారు.

అదితి రావు హైదరీ కెరీర్ ఇలా
ఇక అదితి రావు కెరీర్ విషయానికి వస్తే తెలుగులో సమ్మోహనం చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారు. నవాబు చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో అంతరిక్షం 9000 కేఎంపీహెచ్, తమిళంలో సైకో అనే సినిమాలో నటిస్తున్నారు.

వసంత బాలన్ దర్వకత్వంలో జైల్
జైల్ అనే సినిమాకు విలక్షణ దర్శకుడు వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. మురికి వాడలో కష్టాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నది. క్రైక్స్ సినీ క్రియేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.


Click it and Unblock the Notifications











