twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్దుకుపోతే అవకాశమిస్తాం అన్నారు..సినీరంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయి:అదితీ రావు హైదరీ

    |

    సినీ ఇండస్ట్రీలో మహిళలకు లైంగిక వేధింపులు ఉన్నాయనేది నిజమే అంటోంది అదితీ రావు హైదరీ. గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అవుతోంది కాస్టింగ్ కౌచ్ అనే అంశం. లైంగికంగా లొంగితేనే తమ తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని కొందరు దర్శకనిర్మాతలు అంటున్నారని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బాహాటంగా బయటకు చెప్పేశారు. ఇందులో ప్రముఖులు ఉన్నారని అన్నారు. అయితే కొంతమంది మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతగా లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాల పట్ల స్పందించింది అదితీ రావు హైదరీ

    తన అందచందాలతో వెండితెరను సమ్మోహన పరిచిన అదితీరావు హైదరీ హైదరాబాదులోనే జన్మించింది. 2006 సమ్వత్సరంలోనే లోనే సినీ రంగంలో ప్రవేశించింది. మోడల్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకున్న ఈమెకు తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. కార్తి నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'చెలియా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అతిధి పలు సినిమాల్లో నటించి అందాలు ఆరబోసినప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కలేదు. సుధీర్ బాబు నటించిన 'సమ్మోహనం' సినిమా ఆమె కెరీర్ లో కాస్త చెప్పుకోదగింది. కావలసిన అన్ని అర్హతలున్నా అదృష్టం మాత్రం ఆమడ దూరంలోనే ఉన్న ఈమె ప్రస్తుతం ఉత్తరాదిన సినిమాలు చేస్తోంది. ఈ మేరకు తనకు నచ్చిన కథ రాకనే తెలుగులో సినిమా చేయడం లేదంటోంది అదితీ.

    Aditi Rao Hydari Speaks on Casting couch

    కాగా ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఎదురైన కొన్ని అనుభవాలు చెప్పుకొచ్చింది. తాను లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని, కానీ ఓ సినిమా విషయంలో సర్దుకుపోతే అవకాశమిస్తాం లేకపోతే లేదు. ఛాయిస్‌ నీది అన్నారని పేర్కొంది. అయితే ఎవరూ బలవంతం చేయలేదని చెప్పిన ఆమె.. దానికి ఒప్పుకోకుండా వచ్చేశానని తెలిపింది. ఆ సంఘటన తరువాత దాదాపు ఎనిమిదినెలలు ఖాళీగా ఉన్నానని ఆమె పేర్కొంది. కాగా ''సినీరంగంలో లైంగిక వేధింపులు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే వారు ధైర్యంగా మాట్లాడితే మంచిది. లేదంటే మన మౌనాన్ని మరోరకంగా అర్ధం చేసుకునే ప్రమాదముంది'' అని అదితి పేర్కొనడం విశేషం.

    English summary
    Sammohanam beauty Aditi Rao Hydari spoke about casting couch in cenema industry. She said some of the persons are in cine insutry haraassing womens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X