అదితి రావు అందాన్ని మింగేసిందా.. ప్రిన్సెస్ డ్రెస్‌లో కలల రాణిలా...
స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరి ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై రెడ్ కార్పెట్‌ను అలంకరించింది. అక్కడ తన లుక్ తో అందరినీ మైమరపించిన ఈ బ్యూటీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత ఆమె చేసిన తాజా ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె పిక్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.
పెళ్లికి ముందు సినిమాల్లో నటించే అవకాశం రావాలంటే హీరోయిన్‌లకి చాలా కష్టం. కానీ అదితి రావు నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్న తర్వాతే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆమె 2002లో వివాహం చేసుకోగా, అదితి రావు 2006లో ప్రజాపతి చిత్రంలో సహాయ నటిగా మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. దీని తరువాత ఆమె తమిళంలో నటించింది.

అనంతరం అదితి బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారించి ఆ తర్వాత సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. అయితే హిందీ చిత్రసీమలో అదితి రావు నటించడం ప్రారంభించిన తర్వాత ఆమె భర్త సత్యదీప్ మిశ్రాతో మనస్పర్థలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఇద్దరూ కలిసి జీవించలేమని నిర్ణయించుకున్నారు. దీంతో 2013 లో విడాకులు తీసుకున్నారు. తమిళంలో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అదితికి మణిరత్నం దర్శకత్వంలో నటుడు కార్తీ సరసన 'కౌట్టు ఉయదై' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ఆ తర్వాత చెక్క శివంత వానం, సైకో, హే సినిమాగా చిత్రాల్లో నటించారు. అలాగే కథ, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది అదితి. తెలుగులో ఈ బ్యూటీ 2018 లో సమ్మోహనం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన హీరామండి వెబ్ సిరీస్‌లో బిబ్బోజాన్ అనే పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సిరీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అదితి తాజాగా డ్రీమీ లుక్ లో దర్శనం ఇచ్చి, మరింత మంది ఫాలోవర్స్ ను పెంచేసుకుంది.

ఇక నటనతో పాటు త్వరలో తన ప్రియుడు, నటుడు సిద్ధార్థ్‌ను రెండో పెళ్లి చేసుకోబోతోంది ఈ బ్యూటీ. ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా అదితి రావ్ కేన్స్ లో బేబీ పింక్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌ను అలంకరించిన తర్వాత తీసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో అదితి అచ్చం యువరాణిలా అద్భుతంగా కన్పించింది. ఈ డ్రెస్ లో ఆమె అందం చూస్తే మిగతా హీరోయిన్లు జెలసీగా ఫీల్ అవ్వడం ఖాయం అన్పించేలా ఉంది.


Click it and Unblock the Notifications











