‘అది నమ్మి ఎవ్వరూ మోసపోవద్దు'.. ఫ్యాన్స్‌కు అదితి రావు హైదరీ వార్నింగ్

Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో వరుసగా సినిమాలు చేస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవల సినిమాల సంఖ్య తగ్గినా, ఆమె వ్యక్తిగత జీవితం విషయంలో వార్తల్లో నిలిస్తోంది. 'మహా సముద్రం' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ నటుడు సిద్ధార్థ్‌తో గతేడాది వివాహం చేసుకుని ప్రస్తుతం మ్యారెడ్ లైఫ్‌ను ఆనందంగా గడుపుతోంది. సినిమాలు తగ్గినా, బ్రాండ్ ప్రమోషన్స్, కమర్షియల్ యాడ్స్‌తో బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు అదితి ఫ్యాన్స్ ను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

నటి ఆధితి రావు హైదరి తన పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయబడిందని బయటపెట్టింది. తన ఫోటోలు ఉపయోగిస్తూ "ఫోటోషూట్" పేరుతో ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తున్న ఒక వ్యక్తి తనను అనుకరిస్తూ వృత్తిపరమైన మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కొందరు తన దృష్టికి తీసుకురావడంతో, ఆధితి వెంటనే సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేశారు. తన అభిమానులకు, ఫోటోగ్రాఫర్లకు హెచ్చరిక జారీ చేసింది.

Aditi Rao Hydari Warns Fans of Fake WhatsApp Account Thanks Supporters for Alertness

ఆమె షేర్ చేసిన స్పెష ల్ నోట్ లో "నన్ను అనుకుని ఎవరో వాట్సాప్‌లో ఫోటోగ్రాఫర్లకు మెసేజ్ చేస్తున్నారు. నేను ఇలా ఎవరినీ సంప్రదించను. పనికైనా, షూట్‌కైనా నేను ఏ వ్యక్తిగత నంబర్ వాడను. నా పనులకు సంబంధించిన ప్రతి కమ్యూనికేషన్ నా టీమ్ ద్వారానే జరుగుతుంది" అని పేర్కొన్నారు. అలాగే అందరికీ అప్రమత్తం చేస్తూ "దయచేసి ఆ నంబర్‌తో వచ్చే కాల్స్ కు, మెసేజ్ లకు స్పందించకండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీమ్‌కి సమాచారం ఇవ్వండి" అని విజ్ఞప్తి చేశారు.

ఈ నకిలీ అకౌంట్ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం స్పష్టంగా తెలియనప్పటికీ, ఇండస్ట్రీలోని పలు ఫోటోగ్రాఫర్లకు ఇప్పటికే మెసేజ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది. అకౌంట్‌లో ఆధితి ఫోటోలు పెట్టి నమ్మకం కలిగించేలా ప్రయత్నించడంతో, ఆమె స్వయంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పక తప్పలేదు. "అసలు అది నేను కాదు, నన్ను అనుకుని ఎవరినైనా మోసం చేయాలని చూస్తున్నారు" అని ఆమె స్పష్టం చేశారు.

ఆధితి తన స్టేట్‌మెంట్ చివర్లో "నా కోసం జాగ్రత్తగా నిలబడే, నన్ను కాపాడే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు చూపే ప్రేమే నాకు బలం" అని అభిమానులపై ప్రేమతో, కృతజ్ఞతతో స్పందించారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, ఫోటోగ్రాఫర్లు, ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు మద్దతు తెలుపుతూ "ఇలాంటి మోసపూరిత చర్యలను బహిరంగం చేయడం మంచిదే" అని అభినందిస్తున్నారు. ఈ ఘటనతో సెలబ్రిటీల పేరుతో నకిలీ అకౌంట్లు, ఫేక్ కమ్యూనికేషన్స్ పెరుగుతున్నాయనే విషయం మరోసారి బయటపడింది.

తాజాగా సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరామండి' వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌లో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలు లభించాయి. అలాగే.. బాలీవుడ్‌లో ఢిల్లీ 6, రాక్ స్టార్, పద్మవతి వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. పీరియాడిక్ రోల్స్‌లోనూ, మోడర్న్ పాత్రల్లోనూ తన ప్రత్యేకమైన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

దక్షిణాది సినిమా పరిశ్రమలో కూడా అదితికి మంచి గుర్తింపు ఉంది. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రూ వలియిదై (Kaatru Veliyidai) సినిమాతో తమిళ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించగా, తెలుగులో సుధీర్ బాబు సరసన నటించిన 'సమ్మోహనం' ఆమెకు భారీ క్రేజ్ తెచ్చింది. అనంతరం అంతరిక్షం, వీ, మహాసముద్రం వంటి చిత్రాల్లో ఆమె నటన మరోసారి మెప్పించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X