Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పొలిటికల్ ఎంట్రీపై షకీలా సంచలన నిర్ణయం.. ఏ పార్టీలో చేరతారంటే..?
బి గ్రేడ్ సినిమాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన టాప్ మోస్ట్ నాటిమణుల్లో షకీలా ఒకరు. బోల్డ్ రోల్స్ అనగానే ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ఆ పాత్రలకు పెద్దగా క్రేజ్ ఏమి అందడం లేదు. అయితే అప్పట్లో అలాంటి పాత్రలతో అగ్ర హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్న నటిమణుల్లో షకీలా ఒకరు. ఆమె చేసిన బీ గ్రేడ్ సినిమాలు అప్పట్లో ఒక సెన్సేషన్.. ఇక ఆమె బయోపిక్ త్వరలోనే రిలీజ్ కానుంది..ఈ సందర్భంగా షకీలా తన రాజకీయ ఎంట్రీపై కూడా వివరణ ఇచ్చింది.
స్టార్ హీరోలను కూడా బయపెట్టింది
షకీలా అంటే తెలియని వారు ఉండరు. 90ల కాలంలో ఆమె ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో ఒకరు. బి గ్రేడ్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసిన షకీలా ఒకప్పటి స్టార్ హీరోలను కూడా బయపెట్టింది. ఒక ఏడాదిలోనే 20కి పైగా సినిమాలు చేసి బిజీ ఆర్టిస్ట్ గా క్రేజ్ అందుకుంది.
షకీలా జీవిత ఆధారంగా బయోపిక్
మాలయాళంలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు రీమేక్ అయ్యేవి. ఇక షకీలా జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
రిలీజ్ డేట్ ఫిక్స్
పోస్టర్స్ తోనే గత ఏడాది నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్న షకీలా బయోపిక్ ఫైనల్ గా ఈ క్రిస్టమస్ కు విడుదల కానుంది. ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. గత ఏడాది ఎండింగ్ లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ఆర్థిక కారణాలతో పాటు ఆ తరువాత లాక్ డౌన్ దెబ్బ కొట్టడంతో వాయిదా పడుతూ వచ్చింది.
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన షకీలా
ఇక సినిమా విడుదల సందర్భంగా షకీలా ఒక సంచలన విషయంపై వివరణ ఇచ్చింది. త్వరలో రాజకీయాల్లోకి కూడా రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని అయితే అభిమానుల కోరిక మేరకు తప్పకుండా ప్రజాసేవ చేయడానికి సిద్ధమవుతానని తెలిపారు.
ఏ పార్టీలో చేరతరంటే..
ఇక షకీలా ఏ పార్టీలో చేటక్బోతున్నారనే విషయం కూడా వైరల్ అవుతుండడంతో షకీలా పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చింది. ప్రజాసేవ చేయడానికి పార్టీ ముఖ్యం కాదు అంటూ ఏ పార్టీ ఆహ్వానించినా కూడా అందులోకి వెళతానని ఆమె తెలిపారు. ఇక బయోపిక్ గురించి మాట్లాడుతూ.. నటీనటులకు, ఓ వర్గం మహిళలకు ఒక మంచి పాఠంలా ఉంటుందని అన్నారు.