ఆ బాధితుల కోసం మియా ఖలీఫా భారీ ఆర్థిక సహాయం.. పోర్న్ షూటింగ్‌లో వాడే వాటిని వేలం వేసి..
లెబనాన్‌లో ఇటీవల జరిగిన బ్లాస్ట్ ఘటన ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఘటనకు కారణం అధికారుల నిర్లక్షమా లేక ఉగ్ర వాదుల కుట్ర అనే సందేహాలు ఎన్నో జనాలను కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. అయితే పేలుడులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఇక వారి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా తనకు సంబంధించిన ఒకదాన్ని వేలం వేసి వారికి ఆర్థిక సహాయాన్ని అందించింది.

అత్యదిక క్రేజ్ ఉన్న మియా ఖలీఫా
నేటితరం చాలా మంది కుర్రాళ్లకు మియా ఖలీఫా అంటే ఎవరో తెలియకుండా ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందొ ఒక్కసారి అడల్ట్ ఇండస్ట్రీ రికార్డులపై లుక్కేస్తే అర్ధమవుతుంది. ప్రపంచంలోనే అత్యదిక క్రేజ్ అందుకున్న అతికొద్ది మంది పోర్న్ స్టార్స్ లలో మియా ఖలీఫా ఒకరు.

లెబనాన్ బాధితులు కోసం
లెబనాన్‌లో జన్మించిన మియా ఖలీఫా తన జీవిత మనుగడ కోసం అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫ్యామిలీ ఆర్థిక సమస్యలను ఆమె కొన్ని రోజుల్లోనే తీర్చేసింది. ఇక ఇటీవల మియా లెబనాన్ బాధితులు కోసం ఒక అడుగు ముందుకువేసి ఆర్థిక సహాయం అందించాలని సంకల్పించింది. వేలం పాట ద్వారా ఇప్పటికే లక్ష డాలర్లను ఆమె సంపాదించింది.

షూటింగ్ లో వాడే కళ్ళ జోడికి భారీ డిమాండ్
మియా ఖలీఫా అనగానే ఎక్కువమందికి గుర్తొచ్చేది ఫోర్న్ ఇండస్ట్రీ. అలాగే ఆమె పోర్న్ చిత్రాలలో వాడే కళ్ళ జోడు కూడా చాలా ఫేమస్. నల్ల కళ్ళజోడుకి ప్రపంచ వ్యాప్తంగా మియా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. అయితే ఇప్పుడు లెబనాన్ బాధితుల కోసం ఆమె దాన్ని ఆన్‌లైన్ లో వేలం వేసింది. కొన్ని గంటల్లోనే ఆ కళ్ళజోడుకి భారీ స్థాయిలో డిమాండ్ దక్కింది.

ఆ ప్రజలు అసహ్యించుకున్నా కూడా..
పుట్టిన గడ్డపై జనాలు అల్లాడిపోతున్నారనే బాధ తనను ఎంతగానో బాదిస్తోందని చెప్పిన మియా వీలైనంత వరకు వారికి ఇంకా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పింది. లెబనన్ ప్రజలు కొన్నిసార్లు తను చేస్తున్న వృత్తి పట్ల అసహ్యించుకున్నారని గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపిన మియా ఈ సారి వారికి అండగా తనవంతు సహాయం అంధించడంపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మియా అమెరికాలోనే ఉంటోంది.


Click it and Unblock the Notifications











