వ్యభిచారం కేసులో వెంకటేష్ హీరోయిన్.. అలా ప్రియురాలి కెరీర్ నాశనం!
టాలీవుడ్ సీనియర్ నటి వినీత తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే హీరోయిన్ పేరు చెబితే గుర్తు పట్టడం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఆమె నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గురించి చెప్తే వెంటనే గుర్తుపట్టేస్తారు. విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి 90లో ఎలాంటి చిత్రాలు నిర్మించారో అందరికి తెలిసిందే. తన చిత్రాలతో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో అలరించారు. కుటుంబ నేపథ్య సినిమాలతో విక్టరీ వెంకటేష్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారంటే అతిశక్తి కాదు. వెంకీ చిత్రాలకు అప్పట్లో చాలా డిమాండ్ ఉండేది. కొత్త నటి నటులు వెంకటేష్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించేవారు.
ఈ క్రమంలోనే హీరో వెంకటేష్ సరసన నటించే అవకాశం తగ్గించుకుంది ఈ సీనియర్ నటి వినీత. వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తింపు సినిమా మాత్రం ' ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు'. ఈ చిత్రంలో సౌందర్య ఒక్కతే హీరోయిన్ కాదు... వినీత కూడా రెండవ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. నేపాలి అమ్మాయిగా ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. అప్పటికే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సౌందర్యకు ధీటుగా వినీత పర్ఫామెన్స్ ఇచ్చింది. వెంకటేష్ కు పక్కా జోడి అనిపించి తెలుగు ప్రేక్షకులతో ప్రశంసలు అందుకుంది.

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు... చిత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడలోను చాలా చిత్రాలు చేసింది. ముఖ్యంగా కోలీవుడ్లో చాలా సినిమాల్లో నటించింది. అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. 1993 నుంచి 2006 వరకు వరుసగా సినిమాలు చేసింది. ఆ పీరియడ్లో ఏకంగా 70 సినిమాల వరకు నటించింది. ఇక తెలుగులో చేసినవి తక్కువ సినిమాలో అయినా గుర్తునిపోయే పాత్రల్లో నటించింది. అయితే నటి వినీత చిత్ర పరిశ్రమకు దూరమై దాదాపు 20 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఉన్నట్టుండి అప్పట్లో ఒకేసారి ఇండస్ట్రీకి దూరమైంది. దూరమై ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నటి వినీత కూడా ప్రస్తుతం రీ ఎంట్రీ కి ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తే తిరిగి తెరపై అలరించేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే వినీత ఉన్నట్టుండి సినిమా పరిశ్రమకు ఎందుకు దూరమైంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా గతంలో ఆమెపై నమోదైన ఓ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. 2003లో ఆమెకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ సమయంలో కొందరు ఫిర్యాదు చేయడంతో వినీత పై వ్యభిచారం కేసు నమోదు అయిందని, తన తల్లి సోదరుడితో కలిసి ఈ పనులు చేసేవారని అప్పట్లోనే పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.
కానీ అదంతా అవాస్తవమని 2004లోనే కోర్టు నటి వినీతకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే కొందరు కావాలనే అలాంటి కేసులో ఇరికించి ఆమెను ఎంతో నష్టపోయేలా చేశారని శ్రేయోభిలాషులు చెబుతుంటారు. అదే ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ ఆమెకు భర్తీ చేయలేని నష్టం జరిగిందని ఆమె అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఆ ఒక్క కేసుతో వినీత జీవితం తలకిందులు అయిపోయింది. కెరీర్ మొత్తం అయిపోయింది. అలా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఎంతో ఫామ్ లో ఉన్న హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడం చాలా బాధాకరం. ఎప్పుడు ప్రారంభిస్తుందని అభిమానులైతే ఎదురుచూస్తున్నారు. వీలైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈమె మన తెలుగు హీరోయిన్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications











