మొన్న అల్లు అర్జున్, నేడు పవన్.. అనంతపూర్ పిల్ల కామెంట్!
టాక్సీవాలా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ అల్లు అల్లు అర్జున్ పై నాకు క్రష్ ఉందంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఆ మాట ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం అంటూ బన్నీ సరదాగా స్పందించాడు. అనంతపూర్ కు చెందిన ప్రియాంక తొలి చిత్రంతోనే అందరిని ఆకర్షిస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈమె అనంతపూర్ పిల్ల అంటూ కామెంట్ చేశాడు.
అల్లు అర్జున్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రియాంక జవాల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ తో నటించడం తనకున్న డ్రీమ్ అని తెలిపింది. ఆయన నా అభిమాన నటుడు. ఆయనతో నటించే అవకాశం వస్తే అంతకన్నా థ్రిల్లింగ్ మూమెంట్ ఉండదు అని పేర్కొంది.

టాక్సీవాలా చిత్రం ప్రియాంకకు డెబ్యూ మూవీ. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రియాంక వెలుగులోకి వచ్చింది. టాక్సీవాలా చిత్రం తన కెరీర్ కు ఉపయోగపడే విజయాన్ని అందిస్తుందని ప్రియాంక ధీమాతో ఉంది.


Click it and Unblock the Notifications











