సూపర్ స్టార్‌తో రష్మిక మందన్న రొమాన్స్.. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో నేషనల్ క్రష్!

భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలోనైనా హీరోయిన్‌గా చేసే ఆడపిల్లకైనా వారి అంతిమ లక్ష్యం బాలీవుడ్డే. ఇందులో నో డౌట్. కొందరికి వెంటనే ముంబైలో అదృష్టం వరిస్తే.. ఇంకొందరికి ఎప్పుడో కానీ పిలుపురాదు. బీటౌన్‌లో సక్సెస్ కావడం అంత తేలిక కాదు ఈ విషయం అర్ధమయ్యేలోగా ఫేడవుట్ అవుతారు నటీమణులు. కొందరే తమ అందం, నటనతో బాలీవుడ్‌ను ఏలగలరు. మిగిలిన భాషలేమో కానీ దక్షిణాది అమ్మాయిలకు హిందీ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదు. అక్కడ నెగ్గుకు రాలేక కెరీర్ ముగించేసిన వారెందరో. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న.

కిర్రాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారారు. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా నిలిచిన రష్మికకు సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే రష్మికకు బాలీవుడ్ తలుపు తట్టింది. బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో అవకాశం దక్కింది.

after animal success Rashmika Mandanna cast opposite Salman Khan in AR Murugadoss Sikandar

ఇక లేటెస్ట్ సెన్షేషన్ 'యానిమల్ ''లో గీతాంజలి సింగ్‌గా రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయే భర్తను అర్ధం చేసుకుంటూ , కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఇల్లాలిగా ఆమె ఒదిగిపోయారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యానిమల్ హిట్ కావడంతో రష్మికకు హిందీలో వరుసపెట్టి ఆఫర్లు క్యూకడుతున్నాయి. అయినప్పటికీ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ , మంచి క్యారెక్టర్లకు ఆమె ఓకే చెబుతున్నారు. ఈ క్రమంలో రష్మికు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కింది. అది కూడా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన. ఈ సినిమాను 2025 ఈద్‌ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.

కోలీవుడ్ విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ - సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'సికందర్ ' మూవీలో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేశారు మేకర్స్. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎంతో పోటీని తట్టుకుని సికందర్‌లో రష్మిక అవకాశం దక్కించుకోవడంతో ఆమె లక్ మామూలుగా లేదంటూ నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.

after animal success Rashmika Mandanna cast opposite Salman Khan in AR Murugadoss Sikandar

మరోవైపు.. సికందర్‌లో తనకు అవకాశం దక్కడంపై రష్మిక మందన్న స్పందించారు. తన నెక్ట్స్ మూవీ అప్‌డేట్ ఏంటని అంతా అడుగుతున్నారని.. వారికి నేను ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఇదేనని ఆమె ట్వీట్ చేశారు. సికందర్‌లో భాగం కావడం ఆనందంగా, గర్వంగా వుందని రష్మిక పేర్కొన్నారు. కాగా.. పుష్మ 2, రెయిన్ బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావా, కుబేర చిత్రాల్లో ఈ నేషనల్ క్రష్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X