బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. కొత్త క్రష్ ఎవరో చెప్పేసిన శృతి హాసన్

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పాలి. కాగా అలాంటి అతి కొద్ది మంది హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఒకరు. ఇండియా లెజెండ్ నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ కూతురుగా నెటరీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తో ఇప్పుడు స్టార్ గా మారింది.

కెరీర్ మొదట్లోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి హిట్ గబ్బర్ సింగ్ అందుకొని ఇప్పుడు సౌత్ స్టార్ హీరోస్ సరసన దాదాపు అందరితో నటించేసింది. ఇటీవల ఆమె తెలుగులో చేసిన సినిమాలు అన్నీ చూస్తే మాస్ మహారాజ రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి తో చేసిన వాల్తేరు వీరయ్య తో కూడా కం బ్యాక్ ఇచ్చిన హిట్ సినిమాల్లో కామన్ గా శృతి హాసన్ నే కనిపిస్తుంది.

after breakup with her boy friend shruti haasan says he was her crush

ఇలా శృతి హాసన్ ఐరన్ లెగ్ అనే ట్యాగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. గత ఏడాదిలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో "సలార్" సినిమా చేసి ప్రభాస్ కం బ్యాక్ సినిమాలో కూడా పాలు పంచుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న శృతి రీసెంట్ గా తన పర్శనల్ లైఫ్ సంబంధించి ఓపెన్ అయ్యింది.

ఆమె తన బాయ్ ఫ్రెండ్ నుంచి బ్రేకప్ చెప్పి విడిపోయినట్టుగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు తాను ఎలాంటి రిలేషన్ షిప్ లోకి వెళ్లను అని ఇలానే బాగుంది అంటూ సోషల్ మీడియాలో ముచ్చట్లు కూడా చెప్పింది. ఐతే ఇదే సోషల్ మీడియాలో ఆమె తన సెలెబ్రెటీ క్రష్ ఎవరో అనేది రివీల్ చేసింది.

after breakup with her boy friend shruti haasan says he was her crush

ఇన్స్టాగ్రామ్ లో తనకు ఇప్పుడు ఫేమస్ హాలీవుడ్ నటుడు కిలియన్ మర్ఫీ అంటే క్రష్ అని తన ఓటిటి సెన్సేషనల్ హిట్ "పీకీ బ్లైండర్స్" సిరీస్ నుంచి పిక్ పోస్ట్ చేసి తెలిపింది. దీనితో ఈమె కొత్త క్రష్ అంటూ ఆ పోస్ట్ వైరల్ గా మారింది. కాగా కిలియన్ మర్ఫీ హాలీవుడ్ లో నటించిన, దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన నిజ జీవిత రీసెంట్ చిత్రం 'ఓపెన్ హైమర్' కి అలానే నటుడుగా తనకి కూడా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

మరి అలాంటి స్టార్ సెలెబ్ తన క్రష్ అని చెప్పుకొచ్చింది ఈ భామ. కాగా శృతి హాసన్ ఇపుడు సలార్ పార్ట్ 2, అలాగే యంగ్ హీరో అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమాలు తెలుగులో చేస్తుంది. అలాగే ఇవి కాకుండా హిందీ సహా తమిళ్ లో కూడా పలు సినిమాలు ఆమె చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X