దివంగత హీరోయిన్ జీవితంపై ఫిలిమ్.. మూడు భాగాలుగా లైఫ్ స్టోరీ
బాలీవుడ్ యువ నటి జియా ఖాన్ మరణించి ఏడేళ్లు గడిచినా ఆమె విషయాలు ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ముంబైలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో 2013 జూన్ 3 తేదీన సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఆమె మరణానికి ప్రియుడు సూరజ్ పంచోలి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో సూరజ్‌ను ఈ కేసులో నిందితుడిగా నిర్ధారించారు. 2018లో దాఖలైన ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వివాదాస్పద హీరోయిన్ జీవిత కథను ఆధారంగా చ చేసుకొని వెబ్ సిరీస్‌ను రూపొందించేందుకు బ్రిటిష్ టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ ప్లాన్ చేస్తున్నది.
జియా ఖాన్‌పై రూపొందే డాక్యుమెంటరీ మూడు భాగాలుగా ఉంటుంది. ఇప్పటికే టీమ్ ముంబైలో కథ, కథనాలు, స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నది. ఇంకా మా ప్రాజెక్ట్ ప్రాథమిక స్థాయిలోనే ఉంది అని నిర్మాతలు వెల్లడించారు.

ఇక జియా ఖాన్ గురించి మాట్లాడితే.. అమెరికాలో పుట్టి లండన్‌లో పెరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన నిశ్శబ్ద్ అనే చిత్రంలో నటించింది. గజిని, హౌస్‌ఫుల్ లాంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ ఊపందుకునే స్టేజ్‌లో తన 25వ ఏట ఆత్మహత్య చేసుకొని మరణించారు.
జియా ఖాన్ మరణానికి కారణమని ఆమె తల్లి రాబియా ఆరోపించారు. ఆమె నమోదు చేసిన కేసులో సూరజ్‌పై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది.


Click it and Unblock the Notifications











