42 ఏళ్ల వయసులో నమిత లేటేస్ట్ ఫిగర్ చూశారా? అబ్బో బ్యూటీ అలా అయిపోయిందేమిటి?

నమిత.. ఒకప్పుడు కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన పేరు ఇది. తెలుగు రాష్ట్రాల సంగతేమో కానీ, తమిళ తంబీలు మాత్రం ఏకంగా నమితకు గుడి కట్టేశారు. ముద్దుగా, బొద్దుగా వుండే తారలను ఇష్టపడే తమిళ ప్రేక్షకులు నమిత అందానికి ఫిదా అయిపోయారు. వరుస బ్లాక్‌బస్టర్లతో కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అయ్యారు నిమిత. స్టార్ హీరోల నుంచి చిన్నాచితకా హీరోల వరకు అందరి ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచారు.

అలా కొన్నేళ్లపాటు తమిళ చిత్ర పరిశ్రమలో నమిత శకం నడిచింది. చాలా మంది ఆమె మాదిరిగానే అందాలు పెంచేసి అవకాశాలు చేజిక్కించుకున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఏ బొద్దుతనం తనకి అవకాశాలు తెచ్చిపెట్టిందో.. అదే కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేసేలా చేసింది. నానాటికీ లావుగా మారడంతో నమితకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. హీరోయిన్‌గా చేసిన చోట చిన్నాచితకా సైడ్ క్యారెక్టర్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

After many days senior actress Namitha joined the crowd

అయితే నమిత అంత బరువు పెరగడానికి కారణం డిప్రెషన్, థైరాయిడ్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు విపరీతంగా మందులు వాడటం వల్లే నమిత బరువు పెరిపగిపోయారని టాక్. కారణాలు ఏమైనా సినిమాలకు చెక్ పెట్టే పరిస్ధితి వచ్చింది. 2020లో తమిళంలో రిలీజైన మియానే నమిత నటించిన చివరి సినిమా. తర్వాత కాలంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని 2017లో తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కవల మగపిల్లలు జన్మించారు . ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను నమిత బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ సినిమాల్లో నటించాలని ఈ బొద్దుగుమ్మ బాగా ట్రై చేస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి. మొన్నామధ్య నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలో నమితను ఓ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసినట్లుగా పుకార్లు వచ్చాయి. కానీ అవి గాసిప్స్‌గానే నిలిచాయి. పెళ్లి, పిల్లలు తర్వాత సినిమాలకు దూరమైనా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను పలకరించారు నమిత. డాన్స్ జోడీ డాన్స్ 3.0, పుదు పుదు అర్థాంగల్, కన్నీ తీవు ఉల్లాస ఉల్గామ్ 2.0లలో ఆమె కనిపించారు.

After many days senior actress Namitha joined the crowd

అయితే ఆ తర్వాత నమిత సిల్వర్ స్కీన్, స్మాల్ స్క్రీన్‌పై కనిపించింది లేదు. ఇది ఆమె డైహార్డ్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది. కాగా.. చాలారోజులకు నమిత జనంలో మెరిశారు అది కూడా మన హైదరాబాద్‌లో . నగరంలోని మూసాపేటలో నూతనంగా నెలకొల్పిన ''గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ బ్యూటీ సెలూన్ ''ను నమిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి దివి కూడా పాల్గొన్నారు. నీలిరంగు చీరలో ఎలాంటి హడావుడి లేకుండా నమిత తళుక్కుమన్నారు. ముఖంలో మాత్రం మునుపటి ఛార్మింగ్ ఏ మాత్రం తగ్గలేదు. 40 ప్లస్‌లోనూ ఫిజిక్‌ను బాగానే మెయింటైన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నమిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాకపోతే.. చెన్నైలో సెటిలైన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చూడబోతే నమిత తెలుగులో మరోసారి అవకాశాల కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అనే చర్చ ఫిలింనగర్‌లో జరగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X