మొన్న శ్రీలీల .. ఇపుడు మరో యంగ్ బ్యూటీ , ఈ హీరోయిన్స్‌కి ఏమైంది?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ స్క్రీన్స్ పై ఆడియెన్స్ ని అలరించడానికి సినిమాలో చాలా అంశాలు ముఖ్యం. హీరో ఎలివేషన్స్, ఫైట్స్, డ్రామా, ఎమోషన్స్ అలాగే పాటలు. ఇండియన్ సినిమా ఇవి లేకుండా పూర్తి కావడం అనేది అసాధ్యం అని చెప్పాలి. వీటిలో మరీ ముఖ్యంగా పాటలు అయితే మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాటల్లో ఐటెం సాంగ్స్ అంటే వాటికి ఉండే క్రేజ్ కూడా వేరే లెవెల్ అని చెప్పడంలో సందేహం లేదు.

ఒక సినిమా సక్సెస్ లో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తే ఒకప్పుడు ఐటెం సాంగ్స్ ట్రెండ్ ఒకలా ఉండేది ఇపుడు మాత్రం ఇంకోలా ఉందని చెప్పాలి. మారుతున్న కాలంతో పాటుగా చాలా అంశాలు అప్డేట్ అవుతూ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఈ ఐటెం సాంగ్స్ ట్రెండ్ కూడా మారిపోయింది. అయితే ఐటెం సాంగ్స్ కి ఒకపుడు తెలుగు సినిమా చూసుకున్నా.. హిందీ సినిమా తీసుకున్నా ఐటెం సాంగ్స్ కి కొందరు ఆర్టిస్టులు ప్రత్యేకంగా ఉండేవారు.

after sreeleela another youngest beauty ketika sharma also became item girl

వారి కోసం కూడా సినిమాకి వచ్చేవారు కూడా చాలా మంది ఉండేవారని చెప్పడం అతిశయోక్తి కాదు. కాగా ఇది నెమ్మదిగా మారుతూ వచ్చింది. ఈ క్రమంలో కొత్త కొత్త హాట్ భామలు ఒకరు తర్వాత ఒకరు వచ్చి ఐటెం సాంగ్స్‌కి మరింత హాట్ నెస్ పెంచారు. ఈ తర్వాత ఇండియన్ అమ్మాయిల్లోని ఐటమ్ గర్ల్స్ ని పక్కన పెట్టి విదేశాల నుంచి కూడా దింపి కొన్నాళ్ళు ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేశారు.

ఇక దీనికి కూడా బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోయిన్స్ ని , అప్పుడప్పుడే షైన్ అవుతున్న అందగత్తెలను ఐటమ్ భామలుగా మార్చేసి కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తే అది పెద్ద హిట్ అయ్యింది. ఇది కొన్నాళ్ళు సాగింది కానీ ఇపుడు మాత్రం ఈ ట్రెండ్ లో మరో మార్పు వచ్చింది. ఇపుడు ఏకంగా యంగ్ హీరోయిన్స్ ఐటమ్ గర్ల్స్ గా మారిపోయారు. రీసెంట్ గానే యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ఐటమ్ సాంగ్ కోసం రూటు మార్చిన సంగతి తెలిసిందే.

after sreeleela another youngest beauty ketika sharma also became item girl

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పుష్ప 2 మూవీలో కిస్సిక్ అంటూ ఎప్పుడు లేని అందాలు చూపిస్తూ సెన్సేషనల్ గా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఇపుడు 30 లోపే ఉన్న యువ హీరోయిన్స్ ఐటమ్ భామలుగా మారిపోతున్నారు. శ్రీలీల ఏజ్ కేవలం ఇపుడు 23 ఏళ్ళు మాత్రమే కాగా తనతో పాటుగా మరో యంగ్ హీరోయిన్ ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. ఆమె ఎవరో కాదు పూరి జగన్నాథ్ సినిమా రొమాంటిక్ తో పరిచయం అయ్యిన యువ హీరోయిన్ కేతిక శర్మ.

ఈ అమ్మాయి ఏజ్ కూడా కేవలం 28 ఏళ్లే.. టాలీవుడ్ లో ఏవో చిన్నా చితకా మిడ్ రేంజ్ సినిమాలు ఆమె చేసుకుంటూ వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఐటమ్ గర్ల్ గా మారిపోయి షాకిచ్చింది. టాలీవుడ్ యువ హీరో నితిన్ నటిస్తున్న భారీ చిత్రం "రాబిన్ హుడ్" లో కేతిక ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. దీనితో యుక్త వయస్సులోనే ఐటమ్ భామగా మారిపోయిన మరో హీరోయిన్ గా మారింది అనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

కాగా కేతికకి ఇపుడు హీరోయిన్ గా సరైన అవకాశాలు లేకనే ఇలా చేసింది అంటూ ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇదే కేతిక శర్మ ఐటెం సాంగ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ అందాల ఆరబోత ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 ketika sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X