అమలా పాల్ మూవీ పోస్టర్ మీద దారుణమైన కామెంట్స్, ఎందుకంటే..?

By Bojja Kumar

Recommended Video

Amala Paul's Adai Movie Poster Goes Viral

హీరోయిన్ అమలా పాల్ నటించిన 'ఆడై' మూవీ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్లో సంచలనం అయింది. ఈ పోస్టర్లో అమలా పాల్ ఎన్నడూ లేనంత బోల్డ్‌గా కనిపించడంతో సినీ లవర్స్, అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ పోస్టర్ మీద దారుణమైన, నీచమైన కామెంట్స్ చేస్తూ అమలా పాల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమె నెక్ట్స్ 'పోర్న్ స్టార్' అంటూ కాస్త అభ్యంతరకంగానే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఆడై మూవీ

‘ఆడై' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో అమలా పాల్ లుక్ బాధతో ఏడుస్తున్నట్లు ఉంది. పోస్టర్ చూస్తుంటే ఇది రేప్ విక్టిమ్ కథతో సాగుతుందని తెలుస్తోంది. పోస్టర్ చాలా రియలిస్టిక్‌గా ఉండటంతో పాటు ఆమె హావభావాలు కూడా క్యారెక్టర్‌కు పర్ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉన్నాయి.

సన్నీ లియోన్‌తో పోలుస్తూ

అయితే ఆమె ఈ పోస్టర్లో బికినీని తలపించే దుస్తుల్లో బోల్డ్‌గా కనిపించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. పోస్టర్లో ఆమెను అలా ఎందుకు చూపించారనే విషయాన్ని అర్థం చేసుకోకుండా సన్నీ లియోన్‌తో పోలుస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు.

పోర్న్ సినిమాలు చేస్తోందంటూ

మరికొందరైతే... విడాకుల తర్వాత అమలా పాల్ వెరీ హై లెవల్ పోర్న్ సినిమాల్లో నటిస్తోందంటూ కామెంట్స్ చేశారు. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్‌ను పెళ్లాడిన అమలా పాల్ అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే.

ఫ్యాన్స్ సపోర్ట్

ఫ్యాన్స్ సపోర్ట్

అయితే కొందరు అభిమానులు ఆమెను నెగెటివ్ కామెంట్స్ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోస్టర్లో ఒక సోల్ ఉంది, ఎంతో పెయిన్ ఉంది.... కానీ మీరు కేవలం ఆమె స్కిన్ మాత్రమే చూస్తున్నారు అంటూ ట్రోలింగ్ చేసే వారికి కౌంటర్ ఇస్తున్నారు.

ఇప్పటికైనా ఆపండి

ఇప్పటికైనా ఆపండి

ఈ పోస్టర్ కేవలం సినిమాలోని ఒక సిచ్యువేషన్‌కు సంబంధించినది మాత్రమే. మీరు పొగడ్తలు గుప్పించకపోయినా ఫర్వాలేదు కానీ విమర్శించడం ఆపండి అంటూ.... అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.

 వెంకట్ ప్రభు, రాణా

వెంకట్ ప్రభు, రాణా

ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా ట్విట్టర్లో వస్తున్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్‌కు దాదాపు లక్షన్నకు పైగా లైక్స్ వచ్చాయి. తమిళం, తెలుగు వెర్షన్ పోస్టర్స్ వెంకట్ ప్రభు, రానా దగ్గుబాటి విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X