పీకల్లోతు వివాదాల్లో రష్మిక.. నేషనల్ క్రష్ పై కన్నడ ఆడియెన్స్ ఫైర్

ఇపుడు మొత్తం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సౌత్ నుంచి వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అనే చెప్పవచ్చు. కాగా ఒక దక్షిణాది హీరోయిన్ టోటల్ ఇండియన్ సినిమా దగ్గర వరుస సినిమాలు వాటికి మించి సెన్సేషనల్ హిట్స్ అందించడం అనేది చాలా అరుదుగా జరిగే అద్భుతం.

కాగా అలాంటి అద్భుతాన్నే ఇపుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేస్తుంది. తెలుగు, హిందీ సహా ఇతర ముఖ్య భాషల్లో రష్మిక పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా ఈ కొన్నేళ్లలోనే తాను నటించిన అన్ని సినిమాల్లో 90 శాతానికి పైగా హిట్స్ మాత్రమే ఉన్నాయి. కాగా గత ఏడాదిలో తన నుంచి వచ్చిన చివరి సినిమా పుష్ప 2 ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయితే ఈ ఏడాదిలో తన నుంచి వచ్చిన మొదటి సినిమా "చ్చావా" హిందీలో భారీ ఓపెనింగ్స్ సాధించింది.

again rashmika in another controversy kannada audience fires on her

ఇలా రష్మికా సినిమా పరంగా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కానీ తనపై సోషల్ మీడియాలో సహా పలు అంశాల్లో బయట ఓ రేంజ్ లో ట్రోల్స్ పలు కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. కాగా రష్మిక కన్నడ సినిమా నుంచి వచ్చింది అని అందరికీ తెలిసిందే. అయితే కన్నడ సినిమాలో కంటే తెలుగులో ఎక్కువ హిట్స్ అండ్ ఛాన్స్ లు అందుకున్న రష్మికకి కన్నడ ఆడియెన్స్ ఇంకా అక్కడ కొందరు హీరోస్ నడుమ కొన్ని కాంట్రవర్సీలు లేకపోలేవు.

అయితే వాటి అన్నిటికి దూరంగా ఉన్న రష్మిక లేటెస్ట్ గా కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి లోను కావాల్సి వచ్చింది. ఇటీవల ఆమె చేసిన పలు కామెంట్స్ కన్నడ ఆడియెన్స్ ని బాధించాయట. మరి అంతలా రష్మిక ఏమని చెప్పిందంటే తన ఇల్లు హైదరాబాద్ అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు వివాదంగా మారాయి. కన్నడ నేలకి చెందిన హీరోయిన్ ఇలా తన ఇల్లు మరో ప్రాంతం అని చెప్పుకోవడంతో కన్నడ ఆడియెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

again rashmika in another controversy kannada audience fires on her

కాగా కన్నడ ఆడియెన్స్ కి భాషా, ప్రాంత ప్రీతి ఎంతో ఎక్కువ.. అలాగే మన నుంచి డబ్బింగ్ అయ్యి వెళ్లే సినిమాలు వారి భాషలో పోస్టర్ కనిపించకపోయినా సరే అది ఎలాంటి స్టార్ అయినా కూడా చించి అవతల పడేస్తారు. అంత మక్కువ ఎక్కువ అలాంటిది రష్మిక అక్కడ అమ్మాయి అయ్యి ఉండి తన ఇల్లు హైదరాబాద్ అని చెప్పడంతో ఆమెపై ఫైర్ అవుతున్నారట.

సో మరోసారి కన్నడ ఆడియెన్స్ లో రష్మిక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రష్మిక తన కాలి నొప్పితో బాధ పడుతుండగా దీనితోనే తన హిందీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని తన డెడికేషన్ చూపించింది. ఇక ఈ సినిమా కాకుండా హిందీలోనే సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ అనే సినిమాలో నటిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X