Tamannah Bhatia కోసం రెండు సంస్థల మధ్య పోటీ: భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధం

చాలా కాలంగా వరుస సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీడేస్'తో మొదటి హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్‌లోని అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అదే సమయంలో భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటూ సత్తా చాటింది. ఇంత కాలం సినిమాల్లో సత్తా చాటిన ఈ స్టార్ హీరోయిన్.. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టింది.

కొద్ది రోజుల క్రితం తమన్నా భాటియా 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఇది ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మిల్కీ బ్యూటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెరకెక్కించిన 'నవంబర్ స్టోరీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను చేసింది. ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆ ఓటీటీలో ట్రెండింగ్‌ అయింది. దీంతో డిజిటల్ వరల్డ్‌లో తమన్నా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా అందులో కూడా హవాను చూపిస్తోందీ భామ.

Aha Video and Disney plus Hotstar Fight for Tamannah Bhatia

'లెవెంత్ అవర్' నిరాశ పరిచినా.. ఆహా సంస్థ తమన్నాతో మరో వెబ్ సిరీస్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తోన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీని కోసం దాదాపు రూ. 2 కోట్లు చెల్లించేందుకు సైతం వాళ్లు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు 'నవంబర్ స్టోరీ' హిట్ అవడంతో హాట్‌స్టార్ కూడా తమన్నా డేట్స్ కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. ఈ సంస్థ కూడా ఆమెకు అడిగినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆమె మాత్రం రెండింట్లోనూ నటించేందుకు సిద్ధం అవుతుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X