రెప్పపాటులో ఆశలన్నీ ఆవిరి.. దు:ఖమే మిగిలింది.. సమంత ఎమోషనల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విశేషాలతో పాటు సినిమాలు, ఇతర సంగతులను పంచుకుంటూ ఉంటారు. దేశంలో జరిగే సంఘటనల పైనా స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితంగా ఉండటమే దీనికి కారణం. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళను తన జీవితంలోకి ఆహ్వానించిన నాటి నుంచి సమంత వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆమె ఏం చేసినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. చైతూ రెండో పెళ్లి, ఇప్పుడు అఖిల్ పెళ్లితో తండ్రిగా నాగార్జున తన బాధ్యతను నిర్వర్తించారు. అఖిల్ పెళ్లిలో సమంత ఉంటే చాలా బాగుండేదని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో శ్రేయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా సమంత చేసిన సందడిని వారు గుర్తుచేసుకుంటున్నారు.

Ahmedabad Plane Crash samantha ruth prabhu expressed sadness over the unfortunate incident

రాజ్ నిడిమోరుతో సమంత క్లోజ్
ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌లు తీసిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత గత కొంతకాలంగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండటంతో ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వెళ్లడం, ప్రత్యేక పూజలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. తమ మధ్య ఏం లేదని సమంత, రాజ్‌లు ఖండించినప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు.

కాలమే సమాధానం చెబుతుందన్న రాజ్ భార్య
సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన శుభమ్ సక్సెస్‌మీట్‌లో రాజ్ నిడిమోరు సందడి చేశారు. విమానంలో రాజ్ భుజంపై వాలిపోయి సమంత ఉన్న ఫోటోతో ఈ రూమర్స్ తారాస్థాయికి చేరాయి. సమంత- రాజ్‌లు ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్‌డమ్ అనే ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లావత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలకపాత్ర పోషించనున్నారు. సమంత- రాజ్ సాన్నిహిత్యంపై రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ డే సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంద అంటూ మొన్నామధ్య శ్యామలీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
కాగా.. జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిరిండియా విమానాశ్రయం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది ప్రయాణీకులు, సిబ్బందితో పాటు పక్కనున్న వైద్య కళాశాలపై భవనం విమానం పడటంతో 24 మంది వైద్య విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమంత కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు.

సమంత దిగ్భ్రాంతి
జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని.. లైఫ్ ఎంత దుర్భలమో మనకు గుర్తుచేస్తాయన్నారు. ఎన్నో ఆశలు, కలలు రెప్పపాటులో మాయమైపోతాయని.. చివరికి దు:ఖమే మిగులుతుందని సమంత పోస్ట్ చేశారు. ఎయిరిండియా విమాన ప్రమాద వార్తను దిగమింగుకోవడం కష్టమని.. బాధితుల కుటుంబాలకు ఈ బాధను అధిగమించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని సమంత పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X