మతి పోగొడుతున్న ఎయిర్‌టెల్ భామ సాషా ఛెత్రి.. బికినిలో అందాల ఆరబోత!
వాణిజ్య ప్రకటనలతో చాలా మంది మోడల్స్ మంచి గుర్తింపు తెచ్చుకుని నటులుగా మారుతుంటారు. మోడల్స్ ఎక్కువగా గ్లామర్ పరమైన సోపులు, సౌందర్య లేపనాలు లాంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా యాడ్స్ ద్వారా పాపులర్ అయి హీరోయిన్లుగా మారిన నటీమణులు ఉన్నారు. కానీ సాషా ఛెత్రి అందుకు పుర్తిగా భిన్నం. టెలికం సంస్థ ఎయిర్ టెల్ యాడ్ ద్వారా సాషా ఛెత్రి దేశవ్యాప్తంగా క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది.

బికినీ ఫోటోలు వైరల్
తాజాగా సాషా ఛెత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్విమ్ సూట్ ధరించిన సాషా అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహిళలు ఆలోచన కలిగి ఉండాలి.. తనదైన స్వభావంతో ఉండాలి.. అందంగా కనిపించాలి అంటూ సాషా తన బికినీ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది.

అందరిని ఆకట్టుకుని
సాషా ఛెత్రి ఎయిర్టెల్ సంస్థ 4జి యాడ్ కోసం సాషా ఛెత్రిని ఎంపిక చేసుకుంది. ఆ యాడ్ సాషా జీవితాన్నే మార్చేసింది అని చెప్పొచ్చు. పొట్టి హెయిర్ స్టయిల్ తో, ఎయిర్ టెల్ యాడ్ లో చలాకీగా కనిపించిన సాషా అందరి దృష్టిని ఆకర్షించింది.అప్పట్లో సాషా గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందాల రాబోతుకు తెరతీసిన సాషా నటిగా కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది.

ఫోటో షూట్
థాయిలాండ్ లో నిర్వహించిన ఓ ఫోటో షూట్ లో భాగంగా సాషా ఇలా బికినిలో కనిపించింది. వైట్ డ్రెస్ లో ఉన్న మరో పిక్ లో సాషా హాట్ లుక్ లో కనిపిస్తోంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్దమే అంటూ ఇలా దర్శక నిర్మాతలకు సాషా సందేశాలు పంపుతోంది. సాషా నటించిన తొలి చిత్రం కిట్టి బట్టి. కంగనా రనౌత్, ఇమ్రాన్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో సాషా చిన్న రోల్ ప్లే చేసింది.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్
ప్రస్తుతం సాషా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో ఆది సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్ర ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ అయింది. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











