పెళ్లి తర్వాత ఐశ్వర్య రాయ్‌కి అలాంటి నష్టమా? బచ్చన్ ఫ్యామిలీతో కోల్పోయిందేమిటో తెలుసా?

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ మాజీ ప్రపంచ సుందరి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయస్సు దాటిన ఆమె అందానికి కేరాఫ్. ఆమె తన అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇరువర్ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి తన నట ప్రస్థానం ప్రారంభమైంది. కెరీర్ ఫిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అందాల భామ ఐశ్వర్యరాయ్... బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను 2007లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఆ చిన్నారే ఆరాధ్య .

ఐశ్యర్య తన అందం, అభినయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులకు చేసుకుంది. ఆమె తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఈ మాజీ విశ్వసుందరీ పెళ్లి అయినా తరువాత కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నది. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

Aishwarya Rai- Abhishek Divorce Campaign Aishwarya Rai old video viral

అయితే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడిపోబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా జరిగింది. సోలో గా ఐష్ హాలి డేకు వెళ్లడం, అంబానీ కొడుకు పెళ్లికి ఇరువురు వేరుగా రావడం కూడా పుకార్లకు ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీంతో బాలీవుడ్ బ్యూటీపుల్ కపుల్స్ విడిపోబోతున్నారంటూ.. నానా కథనాలు బీ టౌన్ లో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ మీడియా కూడా ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కోడై కూసింది. దీంతో ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పడేలా రూమర్లపై అభిషేక్ బచ్చన్ స్పందించాడు.

తన పెళ్లి ఉంగరాన్ని చూపిస్తూ.. తాము కలిసే ఉన్నామని, కలిసే జీవిస్తున్నామని స్పష్టం చేశారు. బాలీవుడ్ UK మీడియాతో అభిషేక్ మాట్లాడుతూ తమపై వస్తున్న రూమర్స్ పై స్పష్టత ఇచ్చాడు. "ఈ విషయం గురించి నేను మీతో చెప్పడానికి ఏమీ లేదు. దురదృష్టం కొద్దీ ఈ విషయాన్ని అంతటా వ్యాపింపజేశారు. కానీ మీరు ఇలా ఎందుకు చేస్తారో నాకు అర్థమైంది. మీరు కొన్ని కథనాలను రాయాలి కాబట్టి రాస్తున్నారు. అయినా పర్వాలేదు, మనం సెలబ్రిటీలం, కాబట్టి మేం భరించాలి. " అని అసహనం వ్యక్తం చేశారు. అతని ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Aishwarya Rai- Abhishek Divorce Campaign Aishwarya Rai old video viral

కాగా.. ఇటీవల ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ.. తన వివాహ జీవితం, తన సినిమా కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి, కుటుంబ బాధ్యతల వల్ల తనని తాను ఎప్పుడూ కోల్పోనంటూ ఐశ్వర్య తెలిపింది. తన కుటుంబానికి, వైవాహిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సినీ కెరీర్ కోల్పోయాననే విధంగా ఐశ్వర్య కామెంట్స్ చేసింది. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ మధ్య విడాకులకు సంబంధించిన పుకార్లు నేపథ్యంలో ఈ వీడియో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏదిఏమైనా ఈ విడాకుల ప్రచారానికి తెర పడాలంటే.. ఈ జంట ఎదొక క్లారిటీ ఇవ్వాల్సిందే. అంతవరకు ఈ రూమార్స్ కు ఆగవు.

More from Filmibeat

Read more about: aishwarya rai abhishek bachchan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X