twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్యారాయ్...!

    |

    తంతే బూరెల బుట్టలో పడ్డారు అన్నట్లు, రిజెక్షన్ కు గురయ్యేది అంతకమించిన ఆఫర్ ను అందుకోవడానికేనని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఈ లోకానికి అందాల ఐశ్వర్యారాయ్ పరిచయమయ్యేదే కాదు. అంతేకాదు, బిగ్ బీ లాంటి మాన్ ఆఫ్ ది మిల్లేనియమ్ కూడా దొరికి ఉండేవాడు కాదు.

    దీనికీ ఓ కారణం ఉంది. ఐశ్వర్యారాయ్ 1994లో అందాల రాణిగా కిరీటం కైవసం చేసుకోక ముందే గ్లామర్ ఫీల్డ్ లోకి ఏదో విధంగా ఎంట్రీ సంపాదించుకోవాలనుకుంది. అందుకోసం చిన్న చిన్న పనులు చేసేందుకు సైతం వెనుకాడలేదు. ఇందులో భాగంగానే అమ్మడు ఓ సారి ఓ టీవీ సీరియల్ కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ట్రై చేసేందుకు సిద్ధమైంది. అయితే ఐశ్వర్యారాయ్ గొంతు ఏమాత్రం సూట్ అవ్వడంలేదన్న కారణంతో ఆమెను రిజెక్ట్ చేశారట సెలక్టర్లు.

    Aishwarya Rai as TV serial Dubbing artist!?

    ఏదైనా మన మంచికే అన్నట్లు, ఆరోజు అక్కడ రిజెక్షన్ కు గురైంది కాబట్టే ఐశ్వర్యారాయ్ లో మరింత కసి పెరిగింది. అలా ముక్కోవని పట్టుదలతో 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. బాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగి టాప్ హీరోయిన్ పొజిషన్ ను కైవసం చేసుకుంది. అదే ఆరోజు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆడిషన్ లో ఆమె సెలెక్ట్ అయి ఉంటే.. ఈరోజు ఈ పొజిషన్ కు వచ్చి ఉండేదా!?

    ఇక ఇదే విధంగా ఐశ్వర్యా మామగారు, బాలీవుడ్ బిగ్ బీ సైతం కెరీర్ స్టార్టింగ్ లో చాలా సార్లే రిజెక్ట్ అయ్యారు. ఆల్ ఇండియా రేడియోలో ఆర్జే పొజిషన్ కోసం ధరఖాస్తు చేసుకున్న బిగ్ బీ, గంభీరమైన స్వరానికి గాను రిజెక్ట్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఆయన స్వరమే కోట్లు గడిస్తోంది. కాబట్టి, ఓ కిటీకీ మూసకుంటే అనేక తలుపులు తెరచుకుంటాయని విశ్వాసముంటే చాలు, ఎవరూ ఓటమి గురించి చింతించరు.

    English summary
    Interesting facts - how aishwarya Rai tried her hands on Dubbing and She got rejected for the same. Amitabh Bacchan faced the similar fate with All India Radio.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X