నడిచి వచ్చే గార్డెన్‌వా?.. ఛీ ఛీ. .అదేం డ్రస్సు.. ఐశ్వర్యరాయ్‌ను దారునంగా ట్రోల్ చేసిన నెటిజన్లు
ప్రపంచ సినిమాకు అడ్డగా మారే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 అంగరంగ వైభవంగా మారింది. ఇప్పటికే భారత్ తరఫున పలువురు హీరోయిన్లు రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు. సారా ఆలీ ఖాన్, దీపిక పదుకోన్, ఇషా గుప్తా, ఐశ్వర్య రాయ్ లాంటి సినీ తారలు తమ అందాలతో ఆకట్టుకొంటున్నారు. కాన్స్ రెడ్ కార్పెట్‌పై సీనియర్ హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్ తన గ్లామర్ ప్రదర్శించే ప్రయత్నించారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఐశ్వర్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎయిర్‌పోర్టులో ఐశ్వర్యరాయ్: కాన్స్ ఫిలింఫెస్టివల్ కోసం ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ చేరుకొన్నారు. పారిస్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అభిమానులు భారీగా చుట్టుముట్టారు. అయితే అభిమానులను అడ్డుకోవడానికి బాడీ గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది. అయితే సెక్యూరిటీ సిబ్బందిని కాస్త శాంతపరిచి అభిమానుల సెల్ఫీలకు ఫోజిచ్చింది.

పొన్నియన్ సెల్వన్ విజయంతో: ఐశ్వర్య రాయ్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ తన ఖాతాలో పడింది. పొన్నియన్ సెల్వన్ తర్వాత మళ్లీ భారీ హిట్ అందుకొన్నది. పొన్నియన్ సెల్వన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అడుగుపెట్టింది. రెడ్ కార్పెట్‌పై అందరి దృష్టిని ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే తాను ధరించి డ్రస్ మాత్రం దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయింది.

ప్లాస్టిక్ పూలతో డ్రెస్ డిజైన్: కాన్స్ ఫిలింఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ నలుపు రంగు డ్రస్సులో కనిపించింది. గొడుగుకు ఉండే క్లాత్ మాదిరి డ్రస్‌తో కొత్త అవతారాన్ని ప్రదర్శించింది. ఇక నల్లటి డ్రస్సుపై ప్లాస్టిక్ పూలతో ఓ హారం మాదిరిగా ఒళ్లంత చుట్టేసుకొన్నది. అయితే ఈ డ్రస్‌తో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోగా.. అభాసు పాలైంది. ఎన్నడూ లేని విధంగా కామెంట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
వాకింగ్ గార్డెన్ అంటూ:
ఐశ్వర్య రాయ్ డ్రస్‌ను చూసిన నెటిజన్లు కామెంట్లతో ఆడుకొన్నారు. సర్జరీ క్వీన్ అంటూ కామెంట్ చేశారు. డిజాస్టర్ షో.. వాకింగ్ గార్డెన్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పటి వరకు ఇంత చెత్త లుక్‌ను చూడలేదు. ఇంతకు నీ డిజైనర్ ఎవరమ్మ? బేసిక్‌గా నీ ముఖమే బాగాలేదు అంటూ కొందరు ట్రోల్ చేస్తే.. మరికొందరు 48 ఏళ్ల వయసులో కూడా నీ అందం ముందు ఎవరు సరిలేరు అని అభిమానులు కామెంట్లు పెట్టారు.


Click it and Unblock the Notifications











