ఐశ్వర్యారాయ్ డ్రెస్ చూస్తే షాక్ కావాల్సిందే.. న్యూయార్క్ నగరంలో ఇలా.. నెటిజన్ ట్రోల్స్!
అందాలకు కేరాఫ్ అడ్రెస్స్ ఐశ్వర్యారాయ్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒకానొక సమయంలో వెండితెరపై రారాణిగా కొన్నేళ్ల పాటు ఏలింది ఐశ్వర్య. ఆనాటి నుంచి నేటితరం వరకు ఈమె అందాలకు అందరూ ఫిదా అవుతూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్‌ని పెళ్లాడిన ఈమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐష్ తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చి షాకిచ్చింది.
పికాక్ అనే మ్యాగజైన్ కవర్ పేజీపై ఐశ్వర్య లుక్ ప్రింట్ చేశారు. ఈ పిక్‌లో ఐశ్వర్య వేసుకున్న డ్రెస్ బాగా హైలైట్ అవుతుండటం విశేషం. న్యూయార్క్ నగరంలోని ఓ అందమైన ప్రదేశంలో రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోటోకి ఫోజిచ్చింది ఐశ్వర్య. ఆమె వేసుకున్న ఈ డ్రెస్ శరీరం మొత్తాన్ని కవర్ చేస్తూనే చాలా పొడవుగా ఉండి నేలను తాకుతోంది. నిజానికి ఈ డ్రెస్‌లో మ్యాగజైన్ పేరుకు తగ్గట్టుగా అచ్చం పికాక్ లాగే కనిపిస్తోంది ఐష్. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ పిక్ చూసి నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రోడ్లూడ్చే విధంగా ఐష్ డ్రెస్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఐష్ సినిమాల విషయానికొస్తే.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఓ సరికొత్త ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా అలరించిన ఐష్.. తొలిసారి విలన్‌గా మారనుందని సమాచారం. పైగా ఈ సినిమా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనుండటం మరో విశేషం.


Click it and Unblock the Notifications











