ఐశ్వర్య రాయ్ స్టైలిస్ట్, డిజైనర్లను కాల్చిపారేయాలి..మరీ ఇంత దరిద్రంగానా? నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
ప్రపంచ సినిమా సమ్మేళనంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 రసవత్తరంగా సాగుతున్నది. భారతీయ సినీ తారలు కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై అందాల వెలుగు, జిలుగులు చూపిస్తున్నారు. అయితే భారతీయ సినీ తారల్లో ఐశ్వర్య రాయ్ డ్రస్సింగ్ విషయంలో భారీగా విమర్శలకు గురి అవుతున్నారు. నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌తో పోటెత్తుతున్నారు. గత మూడు రోజుల్లో ఐశ్వర్య రాయ్ ట్రోలింగ్ గురైనట్టు మరొకరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ లుక్‌పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
అభిమానుల తాకిడి నుంచి : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య బచ్చన్‌తో పారిస్ చేరుకొన్నారు. పారిస్ ఎయిర్‌పోర్టులో ఐశ్వర్యరాయ్‌ను చూడగానే సెల్ఫీలకు ఎగబడ్డారు. అభిమానుల తాకిడి నుంచి తన కూతురును రక్షించుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో ఎయిర్‌పోర్టు నుంచి బయటపడింది.

ఐశ్వర్య డిజైనర్ దుస్తులు దారుణంగా : అయితే రెడ్ కార్పెట్‌పై తొలి రోజు ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రస్‌పై నెటిజన్లు దారుణంగా స్పందించారు. అయితే నలుపు రంగు డ్రస్‌పై ప్లాస్టిక్ పూల దండను ధరించి.. రెడ్ కార్పెట్‌పై వాక్ చేయడంతో నెటిజన్లు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్య రాయ్ గెటప్ చూసి.. వాకింగ్ గార్డెన్ అంటూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత కూడా ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు దారుణంగా ట్రోలింగ్ గురయ్యాయి.

గ్రీన్ కలర్ డ్రస్సులో ఐశ్వర్య : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మూడో రోజు కూడా ఐశ్వర్య రాయ్ నెటిజన్ల ట్రోల్స్‌కు బలైంది. ఆమె ధరించిన ఎమరాల్డ్ గ్రీన్ డ్రస్‌పై నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టారు. ఇలాంటి డిజైన్స్ ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ ఐశ్వర్య అందాన్ని అవమానించేలా ఉంది. నీ స్టైలింగ్ సెన్స్ ఏమైంది? అసలు ఐశ్వర్య రాయ్‌వేనా అంటూ కామెంట్స్ చేశారు.

స్టైలిస్ట్‌ను షూట్ చేయాలి అంటూ : విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ గ్లామర్ దృష్టిలో పెట్టుకోకుండా అంతర్జాతీయ వేదికలపై ఆమె డిజైనర్లు, స్టైలిస్టులు పరువు తీస్తున్నారు. ఆమె ధరించే చెప్పులు. హెయిర్ స్టెయిల్, డిజైనర్ డ్రస్సులను చూస్తే.. ఆమెకు డిజైన్ చేస్తున్న డిజైనర్లను, స్టైలిష్టులను పిస్టల్‌తో షూట్ చేయాలనిపిస్తున్నది అంటూ ఐశ్వర్య రాయ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఐశ్వర్య అందాలకు ఫిల్లర్లా : ప్రపంచ సుందరికి కూడా కెమెరాలో ఫిల్టర్లు, ఫోటో ఎడిట్స్ కావొచ్చింది. ఫోటోగ్రాఫర్‌కు కనీసం సెన్స్ కూడా లేదు. ఐశ్వర్య రాయ్ టీమ్ బాగాలేనట్టు కనిపిస్తున్నది. ఆమె ఫోటోలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఐశ్వర్య హెయిర్ స్టైల్ కూడా బాగాలేదు. ఐశ్వర్య విషయంలో ఏం జరుగుతున్నది అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











