హలీవుడ్‌ భామలకు ఈర్ష్య పుట్టేలా.. అందంతో అదరగొట్టిన ఐశ్వర్య రాయ్! స్టార్ హీరోయిన్లు వెలవెల

గత కొద్దికాలంగా మీడియాకు కనిపించకుండా పోయిన ఐశ్వర్యరాయ్ మరోసారి తుళుక్కున అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. వయసు పెరిగినా చెక్కు చెదరని అందంతో ఐషూ అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ మీడియాల్లో ఐశ్వర్య రాయ్ అందం చర్చనీయాంశమైంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాలు పంచుకొన్న ఐశ్వర్య రాయ్ అందం ముందు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల ముద్దుగుమ్మల అందం వెలవెలబోయింది. భారీగా హాజరైన అగ్ర హీరోయిన్లు, టాప్ ఫ్యాషన్ మోడల్స్ ఐశ్వర్య రాయ్ ముందు తమ అందాలను ప్రదర్శించడానికి చాలా కష్టపడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి స్పష్టమైంది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ ప్రదర్శించిన అందాల ఆరబోత గురించి వివరంగా..

రెండేళ్లుగా మీడియాకు దూరంగా

రెండేళ్లుగా మీడియాకు దూరంగా


కోవిడ్, ఇతర సమస్యల కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వేడుకలకు, మీడియాకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే కరోనావైరస్ పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ సినీ, ఫ్యాషన్ సెలబ్రిటీల సందడి మొదలైంది. అంతర్జాతీయ వేదికలపై ఫ్యాషన్ పరేడ్స్, అవార్డుల వేడుకల హంగామా ఊపందుకొన్నది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌ను ఘనంగా జరిపారు. ఈ వేదికపై ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫ్యాషన్స్ సెలబ్రిటీలు, మోడల్స్, సినీతారలు వాతావరణాన్ని కన్నుల పండువగా మార్చేశారు.

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య సందడి

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య సందడి

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉత్సవాలకు ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ప్యారిస్ వెళ్లారు. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌ వెంట రాగా ఐశ్వర్య ఫ్యాషన్ వేడుకల్లో పాలు పంచుకొన్నారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య తన అంద చందాలు, గ్లామర్ లుక్, అలాగే డ్రస్సింగ్ స్టైల్‌తో ఆకట్టుకొన్నారు. ముంబైలో పాపులారిటీ ఉన్న రాహుల్ మిశ్రా రూపొందించిన దుస్తులను ధరించి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు.

ఫ్యామిలీ టైమ్ అంటూ అభిషేక్ బచ్చన్

ఫ్యామిలీ టైమ్ అంటూ అభిషేక్ బచ్చన్

ఐశ్వర్యరాయ్‌కు భర్త అభిషేక్ బచ్చన్ తోడుగా నిలిచారు. ప్యారిస్‌లో అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ టైమ్ అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. ఐశ్వర్యనే కాకుండా అభిషేక్, ఆరాధ్య కూడా ఫ్యాషన్‌పరంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా ఫ్యాషన్ వీక్‌ను ప్యారిస్‌లో ఫ్యామిలీ అఫైర్‌గా మార్చేశారు. ఇప్పుడు అందరినోట ఐశ్వర్య అందం గురించే మాటలు మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

శ్వేతవర్ణం దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య

శ్వేతవర్ణం దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య

ఇక ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా లీ డిఫైల్ లోరియల్ ప్యారిస్ 2021లో ఉమెన్ స్వియర్ స్ప్రింగ్ 2022 షోలో ఐశ్వర్యరాయ్ అదరగొట్టేసింది. శ్వేత వర్ణం దుస్తుల్లో ఆమె మిలమిల మెరిసిపోయింది. సహజసిద్దంగా మేకప్ చేసుకొని తన అందాలతో ఆకట్టుకొన్నది. తెల్లటి దుస్తులు ధరించిన ఐశ్వర్య..పెదాలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ పెట్టుకొని మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

Recommended Video

Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
ప్రపంచ దిగ్గజ హీరోయిన్ల నడుమ

ప్రపంచ దిగ్గజ హీరోయిన్ల నడుమ


ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. బ్రిటిష్ స్టార్ హెలెన్ మిర్రెన్, నటి, గయాని కామిలా కాబెల్లో, ఆస్ట్రేలియా నటి క్యాథరీన్ లాంగ్‌ఫోర్డ్, హౌటూ గెట్ అవే విత్ మర్డర్ ఫేమ్ అజా నోయామి కింగ్, హాలీవుడ్ నటి అంబర్ హార్డ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాక్టర్ నికోలాజ్ కోస్టర్ వాల్డా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అగ్ర హీరోయిన్లు, సెలబ్రిటీల మధ్య ఐశ్వర్యరాయ్ తన సత్తాను మరోసారి చాటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X