ఐశ్వర్య రాయ్..స్టైలిస్ట్ లకు తక్కువ జీతం ఇచ్చారా? కేన్స్‌లో డ్రెస్సింగ్స్‌పై దారుణమైన ట్రోలింగ్!
ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ న్యూ లుక్ పై ట్రోలింగ్ మొదలైంది. ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య ధరించిన పీకాక్ డిజైన్ ఉన్న డ్రెస్ దారుణంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఎందుకు ఐశ్వర్య వేసుకున్న డ్రెస్ పై ఇంతగా విమర్శలు వస్తున్నాయి అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ శుక్రవారం నాడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండవసారి కనిపించింది. రెండో రోజు కూడా ఈ నటి రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐశ్వర్య ఫల్గుణి అండ్ షేన్ డిజైన్ చేసిన సిల్వర్ అండ్ పీకాక్ నీలం రంగు డ్రెస్ ధరించి కన్పించింది ఐశ్వర్య రాయ్.

అచ్చం నెమలిలా ఉన్న ఆ గ్లామరస్ దుస్తులలో ఐశ్వర్య రాయ్ చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ డ్రెస్ చూసిన నెటిజన్లు ఒక్కక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. అయితే అందులో ఎక్కువగా విమర్శలే విన్పిస్తున్నాయి.
సింపుల్ మేకప్‌తో, న్యూడ్ షేడ్ లిప్ స్టిక్ తో, లూజ్ హెయిర్ వదిలేసి స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది ఐశ్వర్య. కానీ ఆమె మేకప్ సరిగ్గా లేకనో లేదంటే డ్రెస్ సెట్ కాకపోవడం వల్లనా అనేది తతెలియదు కానీ ఐశ్వర్య బాగా ఏజ్ అయిపోయినట్టుగా కన్పించడం చాలామందికి నచ్చలేదు.
ఐశ్వర్యరాయ్ కేన్స్ లుక్‌ని చాలామంది క్రూరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, 'ఐశ్వర్య తన కేన్స్ ప్రదర్శనలో అల్యూమినియం ఫాయిల్ బ్రాండ్‌ను రహస్యంగా ప్రమోట్ చేస్తోంది అని ఒకరంటే , మరొకరు మాత్రం నేను ఇంతకంటే దారుణమైన దుస్తువులను ఎప్పుడూ చూడలేదు అని అన్నారు.

అంతేకాకు ఆమె అభిమానులు కూడా అసలు ఆమె ఇంతకు ముందు ఉన్న ఐశ్వర్య రాయ్ అంటే నమ్మలేకపోతున్నాము. ఆమె స్టైలిస్ట్ లకు ఏమైంది? కేన్స్ లాంటి అంత్ర్జాతీయ వేదికపై ఐశ్వర్య పరువు తీశారు అంటూ మంది పడుతున్నారు. ఆమె స్టైలిస్ట్ లకు జీతం తక్కువ ఇచ్చారా ఏంటి? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ముందుగా మీ స్టైలింగ్‌ని మార్చుకోండి. నువ్వు అందంగా ఉన్నావు, కానీ డ్రెస్ బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఐశ్వర్యారాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి కేన్స్ 2024 రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు ఆమె వేసుకున్న డ్రెస్ రెండో రోజు వేసుకున్న దానికంటే బెటర్ అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. నటిగా పరిశ్రమలోకి రాకముందు, ఆమె 1994లో ప్రపంచ సుందరి. ఐశ్వర్య ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందింది.ఇక ఈసారి కేన్స్ లో అసలే ఆమె లుక్ బాగోలేదని కామెంట్స్ విన్పిస్తుంటే, అభిమానులు మాత్రం ఐశ్వర్య రాయ్ చేతికి కట్టు కట్టుకుని కన్పించడంతో ఆమె చేతికి ఏమైందోననే టెన్షన్ లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











