ఆ హీరోయిన్స్ అన్నిటికీ ఒప్పుకుంటారు అందుకే ఎక్కువ అవకాశాలు..లైంగిక వేధింపులపై ఐశ్వర్య రాజేష్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ వరకు చాలా మంది నటీమణులు లైంగిక వేధింపుల గురించి భయటపెడుతున్నారు. కానీ గతంలో ఎప్పుడు లేని విదంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల ఐశ్వర్య రాజేష్ కూడా ఆ విధంగా కామెంట్ చేశారు.

సినిమా ఇండస్ట్రీలోనే కాదు..

సినిమా ఇండస్ట్రీలోనే కాదు..

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే జరగడం లేదు. అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి చోట ఎదో ఒక విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని చాలా మంది సినిమా యాక్టర్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలనే ఫోకస్ చేయడం కరెక్ట్ కాదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఐశ్వర్య రాజేష్ కూడా..

ఐశ్వర్య రాజేష్ కూడా..

సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు అంటేనే షాక్ కి గురయ్యే రోజుల్లో సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు కూడా అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి అంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఇటీవల యాక్టర్ రాజేష్ కూతురు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కోన్నట్లు చెప్పారు. సీనియర్ నటి శ్రీ లక్ష్మీ కూడా ఐశ్వర్య రాజేష్ కి దగ్గరి బందువే. ఐశ్వర్య రాజేష్ ఆమె మేన కోడలు.

అవును అది నిజమే..

అవును అది నిజమే..

అవును నిజంగానే నేను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. కానీ నన్ను నేను ధైర్యంగా నమ్మాను. బోల్డ్ గా ఉంటాను కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను. సమస్యల్ని ఎలా స్వీకరించాలో కూడా తెలుసుకున్నాను. వచ్చిన కొత్తలో పారితోషికాలు కూడా సరిగ్గా ఇచ్చే వాళ్ళు కాదు. రంగు, శరీర ఛాయని సాకుగా చూపించి బాధపెట్టే వాళ్ళు అని ఐశ్వర్య వివరణ ఇచ్చింది.

వాళ్ళకే ఎక్కువ అవకాశాలు..

వాళ్ళకే ఎక్కువ అవకాశాలు..

సినిమా ఇండస్ట్రీలో లో నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అందుకు కారణం వారు గ్లామర్ విషయంలో అన్నిటికీ ఒకే అంటారు. వాళ్ళ తరహాలో మేము ఎక్కువగా గ్లామర్ విషయంలో హద్దులు దాటము కాబట్టి మాకు అవకాశాలు రావు. వాళ్ళ నుంచి సౌత్ హీరోయిన్స్ కి పోటీ ఎక్కువా ఉండడానికి కారణం ఇదేనని ఐశ్వర్య చెబుతోంది.

Recommended Video

Aishwarya Rai Assets More Than Abhishek Bachchan
మంచి నటిగా...

మంచి నటిగా...

ఐశ్వర్య రాజేష్ తమిళ్ సినిమాలతో ఎక్కువగా క్రేజ్ అందుకుంది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో మహిళా క్రికెటర్ గా అద్భుతమైన నటనతో మెప్పించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిలా కనిపించి మరింత క్రేజ్ అందుకుంది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఐశ్వర్య నటనతో మెప్పించడంతో ఆమెకు మంచి అవకాశాలు అందుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X