రష్మిక మందన్న కంటే అది నేనే బాగా చేయగలను.. ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్
అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. థియేటర్, ఓటీటీల్లో సందడి చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఆమె నటించిన స్వప్న సుందరి థియేట్రికల్ తర్వాత ఓటీటీలోకి రాగా.. మరో మూవీ ఫర్హానా బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది.
ముస్లిం యువతిగా కాల్ సెంటర్ లో పని చేసే మహిళగా ఐశ్వర్య నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఫర్హానా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటిఫుల్.

తమిళంలో మాత్రం: 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయం సాధిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో డబ్: మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి తెలుగు చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఐశ్వర్య రాజేశ్ కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ సినిమాలు ఏవి హిట్ కాకపోవడమే కాకుండా ఆమెకు గుర్తింపు లభించలేదు. దీంతో ఐశ్వర్య ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేయడం సాగించింది. కానీ అవి తెలుగులో డబ్ అయి మంచి ఆదరణ పొందాయి.

అన్ని భాషల్లో: 'సుఢల్: ది వర్టెక్స్' వెబ్ సిరీస్, 'డ్రైవర్ జమున', 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్', 'రన్ బేబీ రన్', 'స్వప్న సుందరి' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేశ్. ఈ సినిమాలన్నీ తమిళంలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. తర్వాత ఓటీటీలో అన్ని భాషల్లో విడుదలై అంతకుమించి పాపులారిటీ సాధించాయి.

మే 12న: తాజాగా ఐశ్వర్య రాజేశ్ నటించిన చిత్రమే 'ఫర్హానా'. కె సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ మూవీ మే 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటుంది.

బాగా సరిపోతాను: అయితే ఫర్హానా మూవీ ప్రమోషన్సులో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఐశ్వర్య రాజేశ్. "పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక బాగా నటించింది. అలాంటి అవకాశం నాకు వస్తే నేను కూడా నిరూపించుకునేదాన్ని. నిజానికి శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే నేనే మెరుగ్గా నటించగలను. ఆ పాత్రకు నేను బాగా సరిపోతానని భావిస్తున్నాను, నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చింది" ఐశ్వర్య.

వర్కౌట్ కాలేదు: కాగా తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఎందుకు నటించడం లేదని అడిగిన ప్రశ్నకు.. "నాకు తెలుగు ఇండస్ట్రీ సినిమాలంటే చాలా ఇష్టం. ఇక్కడి నుంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ నా కుటుంబం గర్వపడేలా కమ్ బ్యాక్ లాంటి మంచి తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. అలా చేసిందే వరల్డ్ ఫేమస్ లవర్. కానీ అది ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు" అని ఐశ్వర్య రాజేశ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











