తెలుగా? తమిళా?.. నెటిజన్‌కు హీరోయిన్ దిమ్మతిరిగే కౌంటర్
ఒకప్పటి తెలుగు హీరో రాజేష్ కూతురే ప్రస్తుత క్రేజీ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. అయితే తెలుగమ్మాయే అయినా కూడా తమిళంలోనే బాగాఫేమస్. కోలీవుడ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా మారిపోయింది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటూ మంచి ఆఫర్లను అందుకుంటోంది. తెలుగు ప్రేక్షకులనూ ఇటీవలె పలకరించి మంచి పేరును తెచ్చుకుంది. నేడు తమిళ నూతన సంవత్సర సందర్భంగా ఐశ్వర్యా చేసిన పోస్ట్, నెటిజన్ కామెంట్, ఆమె ఇచ్చిన రివర్స్ కౌంటర్ తెగ వైరల్ అవుతున్నాయి.
నేడు (ఏప్రిల్ 14) తమిళ నూతన సంవత్సరమైన పుత్నాడు పర్వదినం. ఈ సందర్భంగా కోలీవుడ్ సెలెబ్రిటీలంతా తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యా రాజేష్ సైతం తమిళ ప్రజలకు పుత్నాడు విషెస్ చెబుతూ.. అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండండి.. సురక్షితంగా ఉండండిని సూచించింది. ఈ ట్వీట్ ఓ నెటిజన్ భిన్నంగా స్పందించాడు.

మీరు తెలుగు కదా? అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు ఐశ్వర్యా తెలివిగా స్పందించింది. తెలుగు అయితే ఏంటి? తమిళ అయితే ఏంటి? ఈ రోజును ఎంజాయ్ చేయండని కూల్‌గా రిప్లై ఇచ్చింది. కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఐశ్వర్యా.. సువర్ణ పాత్రలో అందర్నీ కట్టిపడేసింది.


Click it and Unblock the Notifications











