For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    8 ఏళ్లకే తండ్రి మరణం, ఇద్దరు అన్నలు కూడా.. ఆ స్టార్ హీరోయిన్ జీవితం ఓ కష్టాల కొలిమి

    |

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన అవకాశాలు అంత ఈజీగా రావు. ఓకేవేళ వచ్చినా కూడా జాగ్రత్తగా ఆ అవకాశాలను ఉపయోగించుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టమే. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ కూడా తన జీవితంలో ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

    Aishwarya Rajesh Family Background & Her Struggling Career
    సినీ బ్యాక్ గ్రౌండ్..

    సినీ బ్యాక్ గ్రౌండ్..

    ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ అలాగే కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది ఐశ్వర్య. తెలుగమ్మాయి అయినప్పటికీ అమ్మడు ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటిస్తోంది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు సీనియర్ లేడి కమెడియన్ లక్ష్మీ కూడా దగ్గరి బందువే. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఈ భామ తన స్వయం కృషితో అవకాశాలు అందుకుంటోంది.

    ఒక్కసారిగా..

    ఒక్కసారిగా..

    ఐశ్వర్య రాజేష్ తండ్రి సినిమాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉండేది. అప్పట్లో రాజేష్ డబ్బు బాగానే సంపాదించాడు. ఐశ్వర్య రాజేష్ కి ముగ్గురు సోదరులు. ఇక ఆడిగినవారికి లేదనకుండా ఎంతో మందికి రాజేష్ డబ్బు సహాయం చేసేవారట. మద్యానికి బానిసైన రాజేష్ కొన్నాళ్లకు అనారోగ్యానికి గురయ్యాడు.

     తల్లి కష్టంతో..

    తల్లి కష్టంతో..

    రాజేష్ మంచానికే పరిమితం కావడంతో ఆయన ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భర్త కోసం ఐశ్వర్య తల్లి LIC ఏజెంట్ గా మారి ఇంటిని పోషిస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్లకు రాజేష్ చనిపోవడంతో ఐశ్వర్య తల్లి తన నలుగురు పిల్లల్ని పోషించి పెద్దవాళ్లను చేసింది. అయితే కొన్నాళ్లకు పెద్ద కొడుకు ఉద్యోగంలో చేరగా ఆ ఫ్యామిలీ దారిలోకి వచ్చింది..

    మరో పెద్ద దెబ్బ..

    మరో పెద్ద దెబ్బ..

    8 ఏళ్లకే తండ్రి మరణించిన బాధలో ఉన్న ఐశ్వర్య రాజేష్ కి కొన్నాళ్ళకు కుటుంబాన్ని పోషిస్తున్న అన్నయ్య కూడా యాక్సిడెంట్ లో చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. మరో ఏడాదికి మరో అన్నయ్య కూడా తనువు చాలించడంతో మరింత షాక్ కి గురైంది. ఇక ఫైనల్ గా నటిగా సక్సెస్ అవ్వాలని ఐశ్వర్య తన కుటుంబ బాధ్యతలను తీసుకుంది.

    స్టార్ హీరోయిన్..

    స్టార్ హీరోయిన్..

    యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ కొన్నాళ్లకు హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలను అందుకొని కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ విషయంలో హద్దులు మీరకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. అలాగే ఆమె కొన్ని సార్లు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు పలు ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చింది.

    English summary
    harassment is prevalent in all sectors, not just in the film industry. Otherwise the film industry is special so everyone here is very focused. This is what many heroines say. But in the film industry, if there are opportunities to share the beds, there are others. In fact, it is also annoying to many good heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X