అలాంటి డ్రెస్‌‌‌‌లో బాడీ చూపించమన్నాడు... స్టార్ హీరోయిన్‌కి భయానక అనుభవం

తెలుగు అమ్మాయిలను తెలుగు చలన చిత్ర పరిశ్రమ చిన్న చూపు చూస్తోందనేది ఎప్పటి నుంచో వినిపిస్తోన్న మాట. అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ సొంత ఇండస్ట్రీయే తమను దూరం పెడుతోందని పలువురు తెలుగు అమ్మాయిలు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోవలోకే వస్తారు అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్. దివంగత నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య‌ కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ అనిపించుకోవడంతో పాటు ఏకంగా కలైమామణి వంటి పురస్కారాన్ని అందుకుని సత్తా చాటింది.

తెలుగు ఇండస్ట్రీ తనను దూరం పెట్టినా.. కోలీవుడ్‌లో రాణిస్తోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ విజయాన్ని సాధించినా ఐశ్వర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రాలేదు. తిరిగి తమిళ చిత్ర పరిశ్రమే ఆమెను నెత్తిన పెట్టుకుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడం, ఎదుర్కొన్న అవమానాల గురించి పంచుకున్నారు ఐశ్వర్య రాజేష్. ఈ వివరాల్లోకి వెళితే..

Aishwarya Rajesh Opens Up About Dress and a Shocking Past Experience

నాకు 8 ఏళ్లు ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి చాలా డబ్బు పొగొట్టుకున్నారు. మా నాన్నగారు చనిపోయేటప్పుటికి చేతిలో ఏం లేదు. మా అమ్మగారు, మేం నలుగురు పిల్లలం. ముగ్గురు అన్నలు, నేను. మా అమ్మే చాలా కష్టపడి పెంచింది. నేను పదో తరగతిలో ఉన్నప్పుడే సంపాదించడం మొదలుపెట్టా. చిన్న చిన్న జాబ్స్ చేసేదానిని.. 250 రూపాయలు, 500 రూపాయలు సంపాదించేదానిని. ఎలాగైనా మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నా. అలా కాలేజీకి వచ్చేసరికి నేను ఒక రియాలిటీ డ్యాన్స్ షో చేశా. నలుగురు పిల్లల్ని పెట్టుకుని ఒక ఆడది ఏ సపోర్ట్ లేకుండా ఎల్ఐసీ పాలసీలు చేయడం కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ చేసేది. మా నలుగురికి మంచి చదువు చెప్పించింది.. మోహన్ బాబు గారి హాస్టల్‌లో చదువుకున్నాం. మంచు మనోజ్ నా పెద్దన్నయ్య క్లాస్‌మేట్ అని ఐశ్వర్య రాజేష్ తెలిపారు.

నేను చెన్నైలో చదువుకున్నా.. టీ నగర్‌లో ఉండేవాళ్లం. 20 ఏళ్లు ఉన్నప్పుడు ఒక అన్నయ్య చనిపోయారు, ఇంకో అన్నయ్య యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఈ సంఘటనలతో అమ్మ షాక్‌లో ఉండిపోయారు. నేను, మూడో అన్నయ్య మాత్రమే ఉన్నాం. అవన్నీ తట్టుకుని అమ్మ నిలబడ్డారు.. ఆమె విల్ పవరే నాకు వచ్చింది. నాన్న లేడు అన్న లోటు లేకుండా మమ్మల్ని పెంచింది. మనం రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. మా నాన్నగారితో ఎక్కువ రోజులు టైం గడపలేదు. 12 ఏళ్లు హీరోయిన్‌గా కెరీర్ ఉన్నప్పటికీ తెలుగులో నాకు పెద్ద బ్రేక్ రాలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ చేసినా కూడా నాకు గుర్తింపు రాలేదు.

మా అమ్మకి తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడం మా అమ్మని ఎంతో బాధించింది. ఈ సమయంలో అనిల్ గారు ఒకరోజు కాల్ చేశారు. నాకు అప్పటికి అనిల్ రావిపూడి ఎవరో తెలియదు. ఆడిషన్స్‌కి వస్తావా అని అనిల్ గారు అడిగారు. తెలుగు సినిమాకి ఆడిషన్స్‌ అని షాక్ అయ్యా. వెంటనే అనిల్ గారిని కలిస్తే ఆయన కథ చెప్పిన తర్వాత నేను చేయలేనని చెప్పేశా. నువ్వు చేయ్.. నేను చూసుకుంటానని అనిల్ గారు నడిపించారు. తెలుగు సినిమాలు చేసే టైంలో మా నాన్నగారితో పనిచేసిన వాళ్లు మాట్లాడేవారు. మీ నాన్నగారు చాలా మంచోళ్లు, ఆయన ఎంత అందంగా ఉండేవాళ్లోనని చెప్పేవారని ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ అయ్యారు.

నీకు బాగా కావాల్సిన వాళ్లు.. ఈ డ్రెస్ నువ్వు వేసుకోకు అని చెబితే నువ్వు వాళ్లు చెప్పినట్లు వింటావా లేదా అని యాంకర్ అడగ్గా.. నేను వాళ్ల మాట వింటానని ఐశ్వర్య రాజేష్ ఆన్సర్ ఇచ్చారు. మా అన్నయ్యే ఇలాంటి డ్రెస్ వద్దు అంటే ఆయన చెప్పినట్లు వింటాను. డ్రెస్ అనేది రెస్పాన్సిబిలిటీ.. ఆ సందర్భానికి, వేదికకు తగినట్లుగా డ్రెస్ ఉండాలని ఐశ్వర్య తెలిపారు. ఇక అన్‌కంఫర్ట్‌గా ఉన్న పరిస్ధితుల గురించి చెప్పమని యాంకర్ అడగ్గా.. జరిగింది అని ఆమె తెలిపారు. నేను యంగ్‌గా ఉన్నప్పుడు మా అన్నయ్యతో కలిసి ఫోటోషూట్‌కి వెళ్లాను. డోర్ ఓపెన్ చేసి మా అన్నని బయటే కూర్చోబెట్టాడు. నైట్ సెక్సీ డ్రెస్‌లు వేసుకుంటారు కదా.. అలాంటి డ్రెస్‌ వేసుకుని నీ బాడీ చూపించు అన్నాడు. నాకు అతని మాట అర్ధం కాలేదు. ఏంటీ అని అడగ్గా... నువ్వు ఏ డ్రెస్‌లో ఎలా ఉంటావో చూడాలని చెప్పాడు. అతను మరో 5 నిమిషాలు మాట్లాడి ఉంటే నేను ఆ డ్రెస్‌ని వేసుకునే దానిని. ఓ రెండు సెకన్లు ఆలోచించి మా అన్న పర్మిషన్ తీసుకుని వేసుకుంటానని చెప్పా. ఇలా ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చేసుంటారు అనుకున్నానని తన జీవితంలో ఎదురైన భయానక సంఘటనను బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X