బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నా అవకాశాలు లేవు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. తక్కువ సమయంలోనే తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటిగా ఎదిగిన ఐశ్వర్య రాజేష్, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గ్లామర్‌కు పరిమితం కాకుండా, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం'సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మరోసారి తన కామెంట్స్ వార్తల్లో నిలిచారు. ఆమె కెరీర్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినా, తెలుగులో తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తున్నాయి. తన కెరీర్, అవకాశాలు, ఇండస్ట్రీలో ఉన్న అపోహలపై ఓపెన్‌గా మాట్లాడారు. "సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పెద్ద హీరోల సరసన అవకాశాలు వస్తాయని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాస్తవానికి అలా జరగలేదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Aishwarya Rajesh Opens Up Blockbuster Hit but No Big Offers in Tollywood

అయితే తాను గ్లామర్ పాత్రలకు పూర్తిగా వ్యతిరేకం కాదని, గ్లామర్‌కు వల్గారిటీకి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకొని పాత్రలను ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేశారు. "స్కిన్ షో చేయడమే గ్లామర్ కాదు. క్యారెక్టర్ బేస్డ్ పర్ఫామెన్స్ ఇస్తూనే గ్లామర్ చూపించవచ్చు" అని చెప్పారు. తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, 'ఈ పాత్ర వచ్చి ఉంటే బాగుండేది' అనే ఫీలింగ్ తనకు లేదని ఐశ్వర్య స్పష్టం చేశారు. 'ఇప్పటివరకు నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చినవే. కొంతమంది ఇంత కష్టపడి ఎందుకు చేశావు అని అడుగుతారు. కానీ నేను మాత్రం చాలా ఇష్టపడి చేశానని గర్వంగా చెప్పుకుంటాను' అన్నారు.

ఈ సందర్భంగా తమిళంలో తాను చేసిన ఓ రియల్ లైఫ్ స్టోరీ ఆధారిత సినిమా గురించి కూడా ఆమె వివరించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, కనీస వసతులు లేకుండా, ఆరు నెలల పాటు షూటింగ్ చేశామని తెలిపారు. 'క్యారవాన్ లేదు, సరైన వాష్‌రూమ్స్ లేవు. కానీ ఆ షూటింగ్ సమయంలోనే జీవితం అంటే ఏంటో అర్థమైంది. చాలా విషయాలు నేర్చుకున్నాను' అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పారు.

బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కూడా అవకాశాలు రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ, 'టాలీవుడ్ డైరెక్టర్లు లేదా హీరోలు.. ఈ అమ్మాయి రూల్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందా? కమర్షియల్ రోల్స్ చేస్తుందా? అనే అపనమ్మకంతో ఆఫర్లు ఇవ్వకపోవచ్చు. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ పెద్ద కమర్షియల్ ఆఫర్లు మాత్రం రాలేదు' అని అన్నారు. అయినప్పటికీ స్క్రిప్ట్ ఓరియెంటెడ్ చిన్న సినిమాలు చేస్తూ సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తాను జీవితాన్ని, కెరీర్‌ను చాలా లైట్‌గా తీసుకుంటానని ఐశ్వర్య తెలిపారు.'ఒక ఆఫర్ పోతే ఇంకో ఆఫర్ వస్తుంది అనే నమ్మకం నాది. బాధగా అనిపిస్తుంది కానీ మనకు రావాల్సినవి వస్తాయి అనే విశ్వాసం ఉంది' అని అన్నారు.

చివరగా, సినిమా అవకాశాలపై మాట్లాడుతూ.. 'సినిమా ఆఫర్లు అందరికీ దొరకని వరం. ఎంతోమంది ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీలో మనం సిన్సియర్‌గా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు అవకాశాలు తప్పకుండా వస్తాయి. కానీ వచ్చిన ఛాన్స్‌ను ఎలా ఉపయోగించుకుంటామన్నదే అసలు కీలకం'అని స్పష్టం చేశారు. బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కూడా అవకాశాల కొరత ఎదురైనా, తనకు నచ్చిన కథలు, పాత్రలతో ముందుకెళ్తూ నటిగా తనదైన ముద్ర వేయాలన్న ఐశ్వర్య రాజేష్ ఆలోచన ఇప్పుడు పలువురికి ప్రేరణగా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X