హీరోయిన్ కాదు... ఫ్రెండ్ క్యారెక్టర్‌కూ పనికి రావు! వెంకటేష్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh).. కలర్ లేకపోయినా తన నటనతోనే ఎంతోమందిని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట్లో ఈమెని తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అవకాశాల కొరతతో తమిళ్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపింది. అక్కడ గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం ఉండటంతో ఆమె ప్రతిభకు గుర్తింపు లభించింది. అయితే.. ఈ యంగ్ హీరోయిన్ తాజాగా తన కెరీర్ మొదట్లో ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించింది. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఐశ్వర్యా రాజేష్ తమిళంలో పేరు సంపాదించుకున్న తర్వాతే టాలీవుడ్ వైపు చూసింది. ఆ తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్-కోలీవుడ్ రెండింటిలోనూ తనదైన గుర్తింపు సంపాదించారు ఐశ్వర్య. గ్లామర్ రోల్స్‌కే పరిమితం కాకుండా, పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తక్కువ సమయంలోనే అగ్రశ్రేణి నటిగా ఎదిగిన ఐశ్వర్య రాజేష్, "హీరోయిన్ అంటే ఇలా ఉండాలి" అనే మూస ధోరణిని చెరిపేసి... నటనతోనే నిలబడగలమని నిరూపించారు.

Aishwarya Rajesh Opens Up on Body Shaming Rejections and Her Journey to Stardom

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి ఐశ్వర్యా రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. తన సినిమా ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న కఠినమైన అందపు ప్రమాణాల గురించి ఆమె హృదయాన్ని తాకేలా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ... "హీరోయిన్ అంటే తప్పనిసరిగా అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, సైజ్ జీరో ఉండాలి అనే రూల్స్ అప్పట్లో చాలా స్ట్రాంగ్‌గా ఉండేవి. 10 -15 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే బొమ్మలాగా కనిపించాలి. తెల్లగా ఉన్నవాళ్లే హీరోయిన్ మెటీరియల్ అనే మైండ్‌సెట్ ఉండేది. కొంచెం రంగు తక్కువగా ఉంటే 'నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు... కనీసం ఫ్రెండ్ క్యారెక్టర్‌కూ పనికిరావు' అని కూడా అన్నారు" అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ మాటలు విన్నప్పుడు తనలో చెప్పలేని బాధ కలిగిందని ఐశ్వర్య రాజేష్ చెప్పారు.అప్పటివరకు హీరోయిన్ కావాలన్న పెద్ద ఆశలు తనలో లేవని, కానీ ఆ అవమానాలే తనలో ఓ కొత్త పట్టుదలను రగిలించాయని వెల్లడించారు. "అప్పుడే నేను నాకే ఒక ప్రశ్న వేసుకున్నా... నేనెందుకు హీరోయిన్ కాలేను? అప్పటి నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఎన్ని అడ్డంకులు వచ్చినా నటిగా నిలబడాలని నిర్ణయించుకున్నా" అని ఆమె ఎమోషనల్‌గా చెప్పారు.

హీరోయిన్ అంటే తప్పనిసరిగా బాంబే నుంచి రావాల్సిందే, ఒకే రకమైన అందపు ప్రమాణాలు పాటించాల్సిందే అన్న భావనను బ్రేక్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు. ఇలా ఉండాలి... అలా ఉండాలి అనే కట్టుబాట్లను చెరిపేయాలనుకున్నా. మనలాంటి అమ్మాయిలు కూడా లీడ్ రోల్స్ చేయగలరని చూపించాలి అనిపించింది' అంటూ తన లక్ష్యాన్ని వివరించారు.

అలాగే..తను ఎదుర్కొన్న చేదు అనుభావాల గురించి ఐశ్వర్య మాట్లాడుతూ..'ఒక సినిమా అవకాశానికి వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నన్ను నైట్ డ్రెస్సులో కనిపించమన్నాడు. నా బాడీ చూడాలన్న ఉద్దేశంతో అలా అడిగాడు. ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది. తర్వాత 'ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడో' అని అనిపించి బాధపడ్డాను' అని తెలిపింది. అయితే ఆ దర్శకుడు ఎవరో మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఇంటర్య్వూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X