‘భారతీయుడు - 2’ నుంచి తప్పుకున్న యంగ్ హీరోయిన్

తెలుగు సినీ చరిత్రలోనే చెప్పుకోదగిన సినిమాల్లో 'భారతీయుడు' ఒకటి. దీనికి కారణం అప్పట్లో భారతదేశంలో ఉన్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించడమే. ఈ సినిమా లంచం తీసుకునే అధికారులు.. వాళ్లను ప్రోత్సహించే నాయకులు, ప్రజలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది. అందుకే ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని శంకర్- కమల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. దీనికి తగినట్లుగానే 'భారతీయుడు- 2' సినిమాను పోయిన ఏడాది మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది.

అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ కీలక నటులపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా నుంచి యంగ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ తప్పుకుందట.

Aishwarya Rajesh Quit From Kamal Haasans Indian 2

అదేంటి.. కమల్ సినిమాలో ఛాన్స్ కోసం చాలా మంది పోటీ పడుతుంటే.. ఆమె సినిమా నుంచి తప్పకోవడం ఏంటి..? అనుకుంటున్నారా. అవును.. ఐశ్వర్యా రాజేష్ తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు పది చిత్రాలకు పైగా ఉన్నాయి. 'భారతీయుడు 2' వల్ల ఆయా సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం అవడం లేదనే కారణంతోనే ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'బిగ్ బాస్' తమిళం సీజన్ -3కి హోస్ట్‌గా ఉన్న కమల్.. చిత్ర షూటింగ్‌లోనూ పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X