ఆ రెండు రోజులు నిద్ర పోలేదు.. హీరోయిన్ ఆవేదన.. ఇదీ అసలు మ్యాటర్!
ఇటీవలే 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఓ పేదింటి అమ్మాయి తన గోల్ ఎలా రీచ్ అయ్యిందనే స్ఫూర్తిదాయకమైన కథతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఇటీవలే ఆమె 'భారతీయుడు 2' సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా లైఫ్, 'భారతీయుడు 2' ను వదులుకోవడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఐశ్వర్య.
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న 'భారతీయుడు 2' లో తనకు అవకాశం వచ్చినపుడు చాలా సంబర పడ్డానని చెప్పింది ఐశ్వర్య. గత డిసెంబర్‌లో ఆ సినిమా కోసం కాల్షిట్లు అడిగిగారని, కానీ ఆ సినిమా ఆగస్టులో ప్రారంభం కావడం కారణంగా తనకు డేట్స్ అడ్జెస్ట్ కాలేదని చెప్పింది. ఆ కారణం గానే ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పిన ఆమె.. కమల్ వంటి నటుడు, శంకర్ లాంటి అగ్ర దర్శకుడు కాంబినేషన్‌లోని సినిమా మిస్సవడంతో చాలా బాధేసిందని తెలిపింది. ఆ సినిమా వదులుకోవడంతో ఆ రెండు రోజులు నిద్ర కూడా పట్టలేదని ఆమె పేర్కొంది.

ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తన కాల్షీట్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె వివిధ భాషల్లో 14 సినిమాలకు సైన్ చేసింది. ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 కి డేట్స్ సర్దుబాటు చేయలేక పోయింది ఐశ్వర్య. అయితే ఈ సారి కమల్ సినిమాలో గానీ, శంకర్ సినిమాలో గానీ అవకాశం వస్తే అస్సలు వదులుకోనని అంటోంది ఐశ్వర్య.


Click it and Unblock the Notifications











