పరస్పర అంగీకారం తోనే దూరమయ్యా.. చాలా బాధేసింది.. ఐశ్వర్య రాజేష్

Recommended Video

'I'm Feeling Sad For Myself' Says Aishwarya Rajesh || Filmibeat Telugu

ఇటీవలే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఓ పేదింటి అమ్మాయి తన గోల్ ఎలా రీచ్ అయ్యిందనే స్ఫూర్తిదాయకమైన కథతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా లైఫ్, అందుకు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఆ వివరాలు చూస్తే..

కమల్ హాసన్‌తో ఐశ్వర్య రాజేష్

కమల్ హాసన్‌తో ఐశ్వర్య రాజేష్

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం భారతీయుడు 2. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్‌ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి తప్పుకుంది ఐశ్వర్య.

కారణం అదే..

కారణం అదే..

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో భారతీయుడు 2 నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై స్పందించింది ఐశ్వర్య. ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్‌ కుదరకపోవడం కారణంగానే తాను కమల్‌ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఐశ్వర్య చెప్పింది. ఇలా తప్పుకోవడం ఇష్టం లేకపోయినా తప్పలేదని ఐశ్వర్య పేర్కొంది.

పరస్పర అంగీకారంతోనే.. బాధగా ఉంది

పరస్పర అంగీకారంతోనే.. బాధగా ఉంది

అయితే భారతీయుడు 2 చిత్ర యూనిట్ తో సంప్రదింపులు చేసి.. పరస్పర అంగీకారంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపింది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ వాదులు కోవడం చాలా బాధగా ఉందని ఈ సందర్బంగా ఆమె చెబుతూ ఆవేదన చెందింది. కమల్‌ సర్‌, శంకర్‌ సర్‌తో కలిసి పని చేయడమంటే అది అరుదైన అవకాశమని, నాకు ఇది డ్రీమ్‌ ప్రాజెక్టు కానీ మిస్సయిందని ఆమె తెలిపింది.

ఐశ్వర్య రాజేష్ బిజీ బిజీ

ఐశ్వర్య రాజేష్ బిజీ బిజీ

ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తన కాల్షీట్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె వివిధ భాషల్లో 14 సినిమాలకు సైన్ చేసింది. ఈ నేపథ్యంలోనే భారతీయుడు 2 కి డేట్స్ సర్దుబాటు చేయలేక పోయింది ఐశ్వర్య. అయితే ఈ సారి కమల్ సినిమాలో గానీ, శంకర్ సినిమాలో గానీ అవకాశం వస్తే అస్సలు వదులుకోనని అంటోంది ఐశ్వర్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X