Vijay Deverakonda మూవీ ఫ్లాప్ ఎందుకంటే?.. నా విషయంలో అలా జరిగింది.. ఐశ్వర్య రాజేష్
డ్రీమ్ వారియర్ సినిమా బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మాణంలో నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ఫరానా. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, ఐశ్వర్య దత్తా తదితరులు నటించారు. ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఫరానా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాకు మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ తదితరులు వెల్లడించారు. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ ..
సువర్ణ పాత్రలో నాకు బాగా నచ్చి: తెలుగులో సినిమాలు చేయలేకపోవడానికి వ్యక్తిగతమైన కారణం ఏమీ లేదు. నేను మంచి సినిమాలు చేయాలనే వెయిట్ చేస్తున్నాను. తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేశాను. అందులో నేను చేసిన సువర్ణ పాత్ర అందరికి నచ్చింది.
ఆ సినిమా బాగా నడుస్తుందా? సూపర్ హిట్ అవుతుందా అనేది తెలియదు. కథ నచ్చి ఆ సినిమా చేశాను. కానీ ఎక్కడో పొరపాటు జరిగి ఆ సినిమా ఆడలేదు. ప్రతీ ఒక్కరు సినిమా బాగుండాలనే మూవీస్ తీస్తారు. ఈ సినిమా ఫ్లాప్ కావాలని తీయరు కదా అని ఐశ్వర్య రాజేష్ అన్నారు.

తెలుగులో ఎందుకు చేయడం లేదంటే?: వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయానికి వస్తే..నేను ఏ సినిమాలో ఉన్నా.. నా ఫెర్ఫార్మెన్స్, నాకు రావాల్సిన గుర్తింపు వచ్చింది. టక్ జగదీష్‌లో చిన్న క్యారెక్టర్ వేసినా నాకు రావాల్సిన క్రెడిట్ నాకు వచ్చింది. తెలుగులో నాకు స్క్రిప్టులు వచ్చాయి. కానీ నన్ను ఆకట్టుకొనే పాత్ర నా వరకు రాలేదు. నాకు ఉన్న పేరు చెడగొట్టుకోవడం ఇష్టం లేక పాత్రలు వదులుకొన్నాను అని ఐశ్వర్య రాజేశ్ తెలిపారు.

ఇప్పుడు ఓన్లీ ఇండియన్ సినిమా: కరోనా తర్వాత సినిమాకు భాష అనేది సరిహద్దు తొలిగిపోయింది. మలయాళం, తమిళం, కన్నడ అనే తేడా లేకుండా సినిమాలను ప్రేక్షకులు చూసేస్తున్నారు. తెలుగు, తమిళం అనే తేడా అవసరం లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమాగా మారిపోయాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వచ్చిన తర్వాత స్పానిష్ భాష వాళ్లు తెలుగు, తమిళ సినిమాలను చూస్తున్నారు అని ఐశ్వర్య రాజేశ్ తెలిపారు.

మంచి అవకాశం వస్తే తెలుగులో: నాకు నచ్చిన.. నా వరకు వచ్చిన ఏ పాత్ర అయినా నేను ఎంత ప్రాణం పోయాలో.. నా శాయశక్తులు ధారపోయాలో నాకు తెలుసు. తెలుగులో ఎందుకు నాకు సెట్ అవ్వడంలో తెలియదు. ఎప్పటికైనా ఏదైనా మంచి సినిమా వస్తే తెలుగు సినిమాలో నటిస్తున్నాను. నాకు కూడా తిరుపతి లడ్డు మాదిరిగా సినిమా చేస్తాను. నేను ఎక్కువ సినిమాలు తమిళంలోనే చేస్తున్నాను. తెలుగులో మంచి సినిమాలు వస్తే చేస్తాను అని ఐశ్వర్య రాజేశ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











