తొలిసారి గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య.. బీచ్‌లో జూమ్ చేసి మరి చూపించిందిగా!
పేరుకు తమిళ బ్యూటి అయిన తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకుంది బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేశ్. కౌసల్య కృష్ణమూర్తి అనే మహిళా ప్రాధాన్యత చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే అరకొర తెలుగు సినిమాలు చేసిన ఈ చిన్నది ప్రస్తుతం తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
సక్సెస్ కాక:'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ అందమైన భామ ఐశ్వర్య రాజేశ్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయం సాధిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

కరువైన ఛాన్సులు:మిస్ మ్యాచ్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి తెలుగు చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేశ్ కు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోవడమే కాకుండా ఆమెకు గుర్తింపు కూడా పెద్దగా లభించలేదు. దీంతో ఎంతో టాలెంట్ ఉన్న ఐశ్వర్యకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

సినిమాల లిస్ట్:ఇక తెలుగులో ఛాన్సులు రాకపోడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ వైపే మొగ్గు చూపింది స్టన్నింగ్ బ్యూటి ఐశ్వర్య రాజేష్. ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేయడమే కాకుండా అవి తెలుగులో డబ్ అయి మంచి ఆదరణ పొందాయి. 'సుఢల్: ది వర్టెక్స్' వెబ్ సిరీస్, 'డ్రైవర్ జమున', 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్', 'రన్ బేబీ రన్', 'స్వప్న సుందరి' వంటి సినిమాలు చేసి ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేశ్.
ఓటీటీల్లో:ప్రముఖ నటుడి కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ సినిమాలన్నీ తమిళంలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. తర్వాత ఓటీటీలో అన్ని భాషల్లో విడుదలై అంతకుమించిన పాపులారిటీ సాధించాయి. ఇటీవల ఫర్హానా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటి మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది.
ఇలా కూడా:ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా జీన్స్ పాయింట్ వేసుకుని బీచ్ వద్ద సందడి చేసింది. అలాగే బీచ్ లో పైన మొత్తం కప్పుకుని కింద చిన్న షార్ట్ మాత్రమే వేసుకుంది. దీంతో ఆమె థైస్ అందాలు తెగ ఎక్స్ పోజ్ అవుతున్నాయి. ఐశ్వర్య ఇలా తొలిసారిగా జూమ్ చేసి మరి థైస్ చూపించడంతో.. ఇలా కూడా కనిపిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











