మొదటి సారి ప్రయత్నిస్తున్నా.. ఐశ్వర్యా రాజేశ్ వీడియో వైరల్
ఐశ్వర్యా రాజేష్‌కు తెలుగు మూలాలున్నా కూడా తమిళంలోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. తమిళ నటిగానే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఐశ్వర్యకు తమిళ, తెలుగు భాషల్లోనూ అభిమానులున్నారు. ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు తన సత్తా చూపించింది. కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో తన నటనతో అందరినీ కట్టిపడేసింది. అలా ఐశ్వర్యకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ పెరిగింది.
అందుకే ఇక్కడి దర్శక నిర్మాతలు ఐశ్వర్యను తమ సినిమాల్లో తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఐశ్వర్య మాత్రం కథకు, తన పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రాలనే ఎంచుకుంటుంది. అలా ఐశ్వర్యా ఓ క్యారెక్టర్‌ను పోషించబోతోందంటే జనాల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. అయితే తాజాగా ఐశ్వర్య విలు విద్యను నేర్చుకునే పనిలో పడింది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా షేర్ చేసింది.

పాత్ర కోసం ఎంత డీ గ్లామర్‌గానైనా కనిపించే ఐశ్వర్య ప్రత్యేకంగా శ్రమిస్తుంది కూడా. పాత్రకు అవసరైన వాటిని నేర్చుకుంటుంది. ఇలా ఇప్పుడు ఐశ్వర్య ఆర్చరీ మీద పడింది. అంటే ఐశ్వర్యా తన రాబోయే చిత్రాల్లో విలు విద్యలో ఆరితేరిన వ్యక్తిగా కనిపించబోతోందని అందరూ కామెంట్లు పెడుతున్నారు. మొదటి సారిగా బాణం వేయడం నేర్చుకుంటున్నాను అంటూ ఐశ్వర్య షేర్ చేసిన వీడియో బాగానే వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications











