Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెచ్చిపోయిన రకుల్ ప్రీత్.. ముదురు హీరోతో రొమాన్స్.. బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా
బాలీవుడ్లో దే దే ప్యార్ దే చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నది. ప్రధానంగా అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్, కెమిస్ట్రీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన వడ్డీ షరాబన్ పాట యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. తాజాగా విడుదల చేసిన తూ మిలా తో హైనా అనే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
తారా స్థాయికి అజయ్, రకుల్ కెమిస్ట్రీ
తూ మిలా తో హైనా అనే పాటను అమాల్ మాలిక్ కంపోజ్ చేయగా సింగర్ అర్జిత్ సింగ్ పాడారు. ఈ పాటలో అజయ్ దేవగన్, రకుల్ ప్రతీ సింగ్ మధ్య రొమాన్స్ తారాస్ఠాయికి చేరుకొందని చెప్పవచ్చు. ఇటీవల బాలీవుడ్లో గానీ.. ఇతర భాషల్లో ఇంత ఘాటుగా ఉన్న పాటను చూడలేదనే మాట వినిపిస్తున్నది.
50 ఏళ్ల హీరోకు లవర్‌గా రకుల్ ప్రీత్
దే దే ప్యార్ దే చిత్రంలో భార్యకు విడాకులు ఇచ్చిన భర్త పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. 50 ఏళ్ల డైవోర్సి అయిన అజయ్‌కు ప్రియురాలిగా రకుల్ పాత్ర పోషిస్తున్నారు. లండన్ నగరంలో వీరిద్దరి మధ్య చిత్రీకరించిన సీన్లు క్రేజీగా ఉన్నాయి. ఇక బెడ్ రూమ్‌లో శృంగారం గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి.
అడల్ట్ కంటెంట్‌తో హాట్ హాట్‌గా
దే దే ప్యార్ దే చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగన్ మధ్య సన్నివేశాలు సినీ వర్గాలు చర్చనీయాంశమయ్యాయి. కేవలం పాటల్లోనే కాకుండా కొన్ని సీన్లు, డైలాగ్స్ పెద్దలకు మాత్రమే అనే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరింత హాట్‌గా మారిందనే మాట వినిపిస్తున్నది. ఇక రకుల్ డ్రెస్సింగ్స్ మరీ నాటుగా, ఘాటుగా ఉన్నాయి. ఎలాగైనా బాలీవుడ్లో హిట్టు కొట్టాలనే కసి రకుల్‌లో కనిపించిందనే భావన నెలకొన్నది.
మే 17న ప్రపంచవ్యాప్తంగా
దే దే ప్యార్ దే చిత్రంలో అజయ్ దేవగన్క భార్యగా టబు నటిస్తున్నది. ఇక ఈ చిత్రంలో జావేద్ జాఫ్రీ, జిమ్మి ష్రెగిల్, అలోక్ నాథ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రానికి అకివ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.