‘బిగ్ బాస్’ ఇంట్లో సైతం డ్రగ్స్ వాడాడు, నన్నూ తీసుకోమన్నాడు....

'దూకుడు'తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్ ఇటీవల డ్రట్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎజాజ్ ఖాన్ గురించి నటి సోఫియా హయత్ సంచలన ఆరోపణలు చేసింది.

గతంలో సోఫియా హయత్, ఎజాజ్ ఖాన్ కలిసి హిందీ బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. ఎజాజ్ అరెస్టైన నేపథ్యంలో సోఫియా స్పందిస్తూ... అతడు చాలా కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నాడని, బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో కూడా అతడు డ్రగ్స్ తీసుకోవడం చూశానని సోఫియా తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం.

 బిగ్ బాస్ ఇంట్లో కూడా...

బిగ్ బాస్ ఇంట్లో కూడా...

బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో కూడా అతడు డ్రగ్స్ వాడాడు. ఆ సమయంలో హౌస్‌లో నా బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగినపుడు నన్ను కూడా తీసుకోమని అడిగాడు అంటూ సోఫియా హయత్ వెల్లడించారు. ఆ సమయంలో అతడు రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకునే వాడని ఆమె వ్యాఖ్యానించాడు.

వింతగా ప్రవర్తించేవాడు

వింతగా ప్రవర్తించేవాడు

డ్రగ్స్ తీసుకున్న సమయంలో అతడు వింతగా ప్రవర్తించేవాడని, అపుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా అతడు ఫన్నీగా వ్యవహరిస్తున్నాడని భావించేవారు అని సోఫియా గుర్తు చేసుకున్నారు.

అక్కడ డ్రగ్స్ అనుమతి లేదు, కానీ...

అక్కడ డ్రగ్స్ అనుమతి లేదు, కానీ...

బిగ్ బాస్ ఇంట్లోకి డ్రగ్స్ అనుమతించరు. కానీ అతడు తెలివిగా తన బాడీ బిల్డింగ్ సప్లిమెంట్స్ బాక్సులో దాచి తీసుకొచ్చేవాడు అని సోఫియా వెల్లడించారు. గతంలో తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేశాడు, ఇండీసెంటుగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.

ఎప్పటికైనా దొరుకుతాడని తెలుసు

ఎప్పటికైనా దొరుకుతాడని తెలుసు

అతడు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడని తెలిసింది. అయితే ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోలేదు. బిగ్ బాస్ 7 షోకు ముందు అతడిని మారియట్ హోటల్‌లో కలిశాను. ఆ సమయంలో నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను నీ రూముకు వస్తే నువ్వు పరవశం పొందేలా చేస్తాను అని చెప్పాడని, ఆ తర్వాత మీడియా ముందు హెల్ప్ చేసే వ్యక్తిలా ఫోజు కొట్టాడని ఆరోపించారు.

 ఎజాజ్ ఖాన్ అరెస్ట్

ఎజాజ్ ఖాన్ అరెస్ట్

ఓ హోటల్‌లో టీవీ నటుడు ఏజాజ్ ఖాన్ లక్షరూపాయల విలువ గల డ్రగ్స్‌తో ఉన్నాడని అందిన సమాచారం మేర పోలీసులు అతడిపై ఆకస్మిక దాడి చేయగా 8 డ్రగ్స్ టాబ్లెట్లు దొరికాయి. ఈ మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 నన్ను ఇరికించారు

నన్ను ఇరికించారు

అయితే తాను స్నేహితులను కలిసేందుకు హోటల్ కు వెళ్లగా లాబీలో ఇద్దరు బాలికలు కలిసి తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకొని ఓ ప్యాకెట్ ను బహుమతిగా ఇచ్చారని, అందులో డ్రగ్స్ ఉన్నట్లు తనకు తెలియదని, తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకే బాలికలు వాటిని ఇచ్చారని ఎజాజ్ ఖాన్ ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X