ఒకపక్క ఏమీ వేసుకోకుండానే ప్రగ్యా షో: ఈ ఎక్స్‌పోజింగ్ నెవ్వర్ బిఫోర్ అంతే!
ఒకప్పుడు ఇండియాలోని హీరోయిన్లు ఆఫర్లు లేకపోతే కనుమరుగు అయ్యేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ద్వారానే ఎంతో మంది ఆఫర్లు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. అందులో టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చాలా కాలంగా సినిమాలు చేస్తోన్న ఈ భామ..
హిట్లను పెద్దగా అందుకోవట్లేదు. ఫలితంగా ఆఫర్లను కూడా దక్కించుకోవట్లేదు. అయితే, ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

నేషనల్ అవార్డ్ మూవీలో: టీనేజ్‌లోనే మోడల్‌గా మారి పాపులర్ అయిన ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ఇదే మూవీ 'డేగ' అనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా నేరుగా తెలుగులోకి అడుగు పెట్టింది. ఇక, జాతీయ అవార్డు మూవీ 'కంచె'తో ప్రగ్యా జైస్వాల్ సెన్సేషన్ అయింది.

టాలీవుడ్‌లో డల్‌గా వెళ్తూ: 'కంచె'లో పద్దతైన నటనతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. దీంతో టాలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం డల్‌గానే సాగుతూ వచ్చిందని చెప్పాలి.

బాలయ్యతో భారీ సక్సెస్: వరుసగా ఫ్లాపులు వస్తున్న ప్రగ్యా జైస్వాల్‌కు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. దీంతో రెండేళ్ల క్రితం బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాను చేసింది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అయింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. ఇది డిజాస్టర్ అవడంతో నిరాశే ఎదురైంది.

సినిమాల్లేవు.. అలా బిజీ: హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా గతంలో ఆఫర్లను అందుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగానే ఉంటోంది. అయితే, ఇటీవలే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. దీని తర్వాత ఫ్యాషన్ వీక్‌లు, హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో అలా: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసి.. ఈ మధ్య పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోన్న ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా సినిమాలు చేయకున్నా అలరిస్తూ ముందుకెళ్తోంది.

హాట్ డోస్ పెంచుతూనే: ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును మరింతగా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో మరింతగా డోస్ పెంచుతూనే ఉంది.

వైరల్‌గా ప్రగ్యా ఫొటోలు: గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె ఒక పక్క ఏమీ లేని డ్రెస్‌లో కనిపించింది. దీనికితోడు ఘాటుగా ఫోజులు ఇచ్చి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











