అఖిల్ భార్య జైనాబ్ నికర ఆస్తుల విలువ.. వేల కోట్లకు వారసురాలని తెలుసా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, కింగ్, నాగార్జున - అమల దంపతుల కొడుకు అఖిల్ అక్కినేని వివాహాం జైనాబ్ రవ్ద్జీతో జూన్ 6న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారి వెడ్డింగ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నూతన వధూవరులను సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆశీర్వదించారు. సెలబ్రెటీలు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనాబ్ రవ్ద్జీ ఎవరు? ఆమె కుటుంబ వివరాలు, వ్యాపారాలు, ఆమె ఆస్తుల నికర విలువ గురించి ఇప్పుడు ఆసక్తికరంంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్ద్జీ లవ్ స్టోరీ..
కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా అఖిల్ అక్కినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ మొదటగా 2016లో వ్యాపారవేత్త కూతురు శ్రియా భూపాల్ తో ప్రేమాయణం నడిపించారు. 2017లో వీరి వివాహాం కూడా చేయాలని పెద్దలు నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు జరుగుతుండగానే ఉన్నట్టుండి వారి వివాహాన్ని నిలుపుదల చేశారు. అందుకు కారణాలను కూడా ఏంటనేది చెప్పలేదు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే జైనాబ్ రవ్ద్జీతో అఖిల్ రిలేషన్ షిప్ స్టార్ చేశారు. మూడు నాలుగేళ్ల పాటు ప్రేమయాణం సాగించారు. ఇక 2014 నవంబర్ లో ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. జూన్ 6న హైదరాబాద్ లో తెలుగు సంప్రదాయం ప్రకారం అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్ద్జీ ల వివాహాం ఘనంగా జరిగింది.

జైనాబ్ రవ్ద్జీ ఫ్యామిలీ వివరాలు, ఆస్తులు..
జైనాబ్ రవ్ద్జీ చాలా ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు. ఆమెకు సంబంధించిన కొద్ది వివరాలు ఆసక్తికంగా ఉన్నాయి. జైనాబ్ రవ్ద్జీ ఒక ఆర్టిస్ట్. ఆమె కల్చరల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. ఆమెకు పేయింటింగ్ అంటే చాలా ఇష్టం తరుచుగా తను వేసిన పెయింటింగ్స్ ను హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శిస్తూ ఉండేది. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ఒక పెద్ద వ్యాపారవేత్త. నిర్మాణ రంగంలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కలిగి ఉన్నారు. ఆ కంపెనీకి చైర్మన్, ఎండీగా ఆయనే.
ఇండియా వైడ్ గా కన్ స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్ట్స్..
అలాగే పలుచోట్ల వీరికి వీటీ యూనిట్లు ఉన్నాయి. ముంబై బేస్డ్ ఫ్యామిలీ అయిన వీరు హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఎనర్జీ కంపెనీలతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ స్థిరపడ్డారు. వీరి ఆస్తుల విలువ వేల కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. దీనిపై స్పష్టత లేదు. ఇక జైనాబ్ రవ్ద్జీ కి సోదరుడు జైన్ రవ్జీ కూడా ఉన్నారు. ఆయన తమ వ్యాపారాలనే చూసుకుంటూ ఉంటారని తెలుస్తోంది. ఇండియా వైడ్ గా వీరికి కన్ స్ట్రక్షన్, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది.
ఘనంగా అఖిల్, జైనాబ్ ల వివాహం..
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలోనే అక్కినేని అఖిల్ - జైనాబ్ రవ్ద్జీ వివాహం జరిగింది. జూన్ 6 తెల్లవారుజామున 3 గంటలకు తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుమంత్ హాజరయ్యారు. ఇక అన్న నాగచైతన్య - శోభితా ధూళిపాళ అతిథులను రిసీవ్ చేసుకుంటూ సందడి చేశారు.


Click it and Unblock the Notifications











