నాగార్జున - టబులపై అలాంటి రూమర్లు.. స్పందించిన అమల
టాలీవుడ్ స్టార్, సీనియర్ హీరో నాగార్జున ఆరు పదుల వయస్సులోనూ యంగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వెండితెరపై అదరగొడుతున్నారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపు దిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో కీలక పాత్రలు పోషిస్తూ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సినిమాలతో మంచి వ్యాపారం కూడా చేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున కుటుంబంతోనూ ఎంతో సంతోషంగా ఉంటారు. సమయం కేటాయించుకొని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉంటారు. ఇక అమలను నాగార్జున ఎంత బాగా చూసుకుంటారో తెలిసిందే. అమలకు తగిన గౌరవం ఇస్తూ అమల చేసే సోషల్ యాక్టివిటీస్, పలు కార్యక్రమాలకూ సహకరిస్తూ ఉంటారు. అయితే తాజాగా అమల నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ గా స్పందించింది.
ఆదర్శ దంపతులుగా అమల - నాగార్జున..
అక్కినేని నాగేశ్వర రావు నటవారసుడిగా అక్కినేని నాగార్జున విజయవంతం అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నాగార్జున తనకుంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీని సరైన మార్గంలో నడిపిస్తున్నారు. అయితే నాగార్జున విజయోత్సవంలో అమల కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది.అమల - నాగార్జునలకు 1992లో వివాహం జరిగింది. అంతకు మందే నాగార్జునకు లక్ష్మి దగ్గుబాటితో 1984లో వివాహం అయ్యింది. 1986లో వీరికి నాగ చైతన్య పుట్టారు. 1990లో డివోర్స్ తీసుకున్న తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు. 1994లో అఖిల్ కు జన్మనిచ్చారు. అయితే అప్పటి నుంచి అమల నాగచైతన్య సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి సమయంలోనూ ఇద్దరూ ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటూ ఆదర్శంగా మారారు.

అలాంటి రూమర్లు.. స్పందించిన అమల..
అక్కినేని నాగార్జున 1986 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. హీరోగా ఇప్పటి వరకు 99 చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే నాగార్జునకు 1996లో విడుదలైన 'నిన్నే పెళ్లాడుతా' చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అయితే ఆ చిత్రంలో నాగార్జున - టబు కలిసి నటించారు. ఆ చిత్రంతో పాటు ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. అదే సమయంలో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి.
నాగార్జున - టబు మధ్య చాలా కాలంగా రూమర్లు కొనసాగాయి. అయితే వాటిపై తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల స్పందించింది. ఆ రూమర్లకు చెక్ పెట్టింది. 'నా భర్తపై నాకు చాలా నమ్మకం ఉంది'.. అంటూ ఒక్క మాటతో పుకార్లను పటాపంచెలు చేసింది. ఈ మాటతో ఇప్పటికీ నాగార్జునపై ఎంతటి అమితమైన ప్రేమను కలిగి ఉందో తెలియజేసింది. ఇక నాగార్జున అమల ఇలాగే ఉండాలని, వారి జీవితం యువ తరానికి ఆదర్శంగానూ నిలుస్తుందని అభిమానులు అంటున్నారు.
నాగార్జున రాబోయే చిత్రాలు..
టాలీవుడ్ సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జున చివరిగా 'నా సామీ రంగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఏడాది తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు. కానీ సౌత్ ఇండియాలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్స్ ల్లో మాత్రం కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు ప్రొడక్షన్ బ్యానర్లలో రూపుదిద్దుకుంటున్న 'కుబేరా', అలాగే తమిళ చిత్రం 'కూలి'లో కీలక పాత్ర పోషించారు. ధనుష్ కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్ కూలి చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.


Click it and Unblock the Notifications











