నిహారిక 'సూర్యకాంతం' సెకండ్ సాంగ్ చైతు చేతుల మీదుగా!
మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత నిహారిక కేవలం తనకు సరిపడే పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులువేస్తోంది. తాజాగా నిహారిక నటిస్తున్న చిత్రం సూర్యకాంతం. రాహుల్ విజయ్ నిహారికకు జంటగా నటిస్తున్నాడు. దర్శకుడు ప్రణీత్ హాస్యానికి పెద్ద పీట వేస్తూ నిహారిక పాత్రని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన సూర్యకాంతం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ చిత్రంలోని 'ఫ్రైడే ఆంథం' అనే సెకండ్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. హీరో నాగచైతన్య చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ కాబోతోంది.

సూర్యకాంతం చిత్రంలో నిహారిక పాత్ర చాలా సరదాగా సాగనుంది. దీనితో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మార్క్ రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ బ్యానర్ లో సందీప్ ఎర్రంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చ్ 29న సూర్యకాంతం చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











