Shobita Dhulipala: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఇంతకీ శోభిత అసలు పేరేంటీ?

Sobhita Dhulipala Naga Chaitanya Wedding Card: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాలతో ఏడడుగులు వేయడానికి సిద్దమయ్యారు. ఇటీవల వీరి శోభిత- చైతూల నిశ్చితార్థం సీక్రెట్ గా జరిపి.. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశారు. అప్పటినుండి వీరి పెళ్లి ఎప్పుడు? వివాహం ఎక్కడ జరగబోతుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. తాజా ఈ డిస్కషన్ కు తెరపడింది. ప్రస్తుతం వారి పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ సమయంలో శోభిత పేరుకు సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటీ?

అక్కినేని వారింట్లో త్వరలో పెళ్లి భాజలు మోగనున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే చర్చ ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా వీరి పెళ్లి ఎప్పుడంటూ ఆత్రుతగా వెయిట్ చేశారు. అయితే ఆ ఉత్కంఠకు తెర పడేలా ఈరోజు (ఆదివారం) ఉదయం నుండి నాగచైతన్య శోభితాల పెళ్లి పత్రికలు నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

akkineni naga chaitanya sobhita Dhulipala s wedding card goes viral sobhita name different in wedding card

ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగక.. డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటవుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆహ్వాన పత్రికలను అక్కినేని, ధూళిపాల కుటుంబ సభ్యులు పంపుతున్నారు. ఈ వెడ్డింగ్ ప్రకారం.. డిసెంబర్ రెండవ తేదీన సంగీత్, మూడవ తేదీన మెహందీ, డిసెంబర్ నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు ప్రస్తావించారు. వీరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగబోతుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కి సినిమా సెట్‌ను రూపొందించే బాధ్యతను అక్కినేని నాగార్జున అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వేడుకకు పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య, శోభిత వెడ్డింగ్ కార్డులో వధూవరుల తల్లిదండ్రులతో పాటు వాళ్ల అమ్మమ్మ , నాయనమ్మ , తాతయ్యల పేర్లను రాశారు. అలాగే.. నాగచైతన్య తల్లిదండ్రులుగా అక్కినేని నాగార్జున - అమల పేర్లతో పాటు.. నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ, ఆమె రెండవ భర్త విజయ రాఘవన్ పేర్లను కూడా ముద్రించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు , అన్నపూర్ణ, రామానాయుడు, రాజేశ్వరి పేర్లను ముద్రించారు.

akkineni naga chaitanya sobhita Dhulipala s wedding card goes viral sobhita name different in wedding card

అంత బాగానే ఉన్నా.. శోభిత పేరు విషయంలోనే నెటిజెన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ శోభిత అసలు పేరేంటి? తెగ వెతుకుతున్నారు. అసలు ఏం జరిగిందంటే... ధూళిపాల వారి పెళ్లి పత్రికలో శోభిత అని ముద్రించగా.. అక్కినేని వారి పెళ్లి పత్రికలో లక్ష్మీ శోభిత గా ప్రస్తావించబడింది దీంతో.. శోభిత అసలు పేరు ఏంటో గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. వాస్తవానికి శోభిత అసలు పేరు శోభిత ధూళిపాళ. ఇదిలా ఉంటే.. పెళ్లి కార్డులతో పాటు స్పెషల్ గిఫ్ట్స్‌ ను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. వెడ్డింగ్ కార్డుతో చీర, పసుపు, కుంకుమ, వెండి వస్తువులను కూడా పంపిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X