అప్పుడే తల్లిని కావాలని లేదు .. అక్కినేని ఫ్యామిలీకి షాకిచ్చిన శోభిత
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు.. ప్రేమ, పెళ్లి, బ్రేకప్స్‌తో పాటు తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా కూడా ప్రకటిస్తూ తమ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రాలు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఎన్నాళ్ల నుంచో ఈ జంట పేరేంట్స్‌గా ప్రమోషన్ కొట్టేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశలు ఫలించి ఈ జంట శుభవార్త చెప్పింది. ఒక్క బాలీవుడ్‌లోనే టాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ కొన్ని స్టార్ జంటలున్నాయి. వీరు గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఫ్యాన్స్, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ - లావణ్య
టాలీవుడ్‌లో ప్రముఖమైన మెగా ఫ్యామిలీ వారసులలో ఒకరైన వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఈ జంట శుభవార్త చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో వరుణ్ - లావణ్యలు తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వీటిని మెగా కాంపౌండ్ ఖండించలేదు. ఈ వార్తలను నిజం చేస్తూ రెండ్రోజుల క్రితం వరుణ్ - లావణ్యలు తాము పేరేంట్స్ కాబోతున్నామని సోషల్ మీడియాలో అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

సంబరాల్లో మెగా ఫ్యామిలీ
లావణ్య, వరుణ్‌లు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి ఇద్దరూ కలిసి బేబీ సాక్స్, షూస్ పట్టుకున్న ఫోటోను వారు పంచుకున్నారు. ఈ న్యూస్ బయటికి రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా కుటుంబంలో వరుసపెట్టి శుభాలు జరుగుతుండటంతో చిరంజీవి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్ - లావణ్య జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. వరుణ్ కూడా లావణ్యను కేరింగ్‌గా చూసుకుంటున్నారు.
హనీమూన్‌లో నాగచైతన్య - శోభిత
తెలుగునాట ఒకేసారి ఇద్దరు హీరోయిన్లపై ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుకార్లు వార్తలు వచ్చాయి. వారిలో ఒకరు మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాగా.. మరొకరు అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ. లావణ్య శుభవార్త చెప్పి పుకార్లకు చెక్ పెట్టడంతో ఇప్పుడు శోభిత వంతు వచ్చింది. సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడ్డ నాగచైతన్య పెద్దల అంగీకారంతో ఆమెను గతేడాది డిసెంబర్‌లో పెళ్లాడాడు. నాటి నుంచి కొత్త జంట హనీమూన్‌లో గడుపుతోంది. ఇప్పటికే యూరప్, మెక్సికో తదితర దేశాల్లో గడిపిన చై- శోభితలు ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు.
కడుపు భాగాన్ని కవర్ చేసుకుంటున్న శోభిత
నాగచైతన్య - శోభితలు గర్భం దాల్చినట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్‌గా వేవ్స్ సమ్మిట్‌కు తన భర్త నాగచైతన్యతో కలిసి వెళ్లిన శోభిత చీరకట్టులో అదిరిపోయింది. ఆ సమయంలో తన ఉదర భాగాన్ని కవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించడంతో శోభిత మీడియాకు దొరికిపోయింది. ఆ వెంటనే శోభిత గర్భం దాల్చారని విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీటిని అక్కినేని ఫ్యామిలీ కానీ, శోభిత ఫ్యామిలీ కానీ ఖండించకపోవడంతో ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది.
గుడ్‌న్యూస్ ఇప్పట్లో ఉండదన్న శోభిత
ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా శుభవార్త చెప్పడంతో శోభితపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శోభిత టీమ్ స్పందించింది. శోభిత తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని, గర్భం దాల్చడంపై ఇంకా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లేనని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











