మొన్ననే చైతూతో హనీమూన్‌కి.. అప్పుడే వైరాగ్యమా.. సోలో ఫోటోలతో షాకిచ్చిన శోభిత
అక్కినేని వంశం నుంచి మూడో తరం నటుడిగా రాణిస్తున్నారు నాగచైతన్య. తాత, తండ్రి బాటలో లవర్ బాయ్‌గా, రొమాంటిక్ హీరోగా దూసుకెళ్తున్నారు. హీరోయిన్ సమంత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయారు. కొద్దిరోజుల పాటు సింగిల్‌గానే ఉన్న చైతూ ఆ తర్వాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోపు పెళ్లి చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
శోభితతో వివాహం జరిగినా తండేల్ రిలీజ్ ఉండటంతో కనీసం గడ్డం కూడా తీయలేక ఇబ్బందులు పడ్డాడు చైతూ. నిన్ను క్లీన్ సేవ్‌లో చూడాలనుకుంటున్నా సామీ అంటూ శోభిత స్వయంగా పోస్ట్ పెట్టిందంటే అర్ధం చేసుకోవచ్చు. పెళ్లయ్యాక హనీమూన్‌కి వెళ్లకుండా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపాడు. శోభిత వచ్చిన వేళా విశేషం ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నాగార్జున అయితే చాలా రోజుల తర్వాత సక్సెస్‌మీట్‌కు వచ్చానంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తండేల్ సక్సెస్ తర్వాత భార్యను తీసుకుని హనీమూన్‌కి వెళ్లారు నాగచైతన్య. అక్కడ సమోసాలు తింటూ ఈ జంట ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత నాగచైతన్య కజిన్ , హీరో దగ్గుబాటి రానాకి చెందిన స్టోర్‌లో సందడి చేశారు చై- శోభిత. అయితే కొద్దిరోజులుగా చైతన్య, శోభితలు పలు సందర్భాలలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చైతూ మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంతతో శోభితను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి నుంచి నేటి వరకు సామ్‌ను శోభిత కాపీ కొడుతున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల నాగచైతన్య - శోభితలు ఓ మ్యాగజైన్ కవర్ ఫోటోకు ఫోజులిచ్చారు. స్టైలీష్ లుక్‌లో ఈ జంట ఆకట్టుకోవడంతో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ శోభిత వేసిన ఔట్ ఫిట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ డ్రెస్ గతంలో సమంత వేసిన డ్రెస్‌ను పోలి ఉండటం చర్చనీయాంశమైంది. పెళ్లి తర్వాత ఏవరేం అనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు శోభిత, నాగచైతన్య.
తండేల్‌తో హిట్ ట్రాక్ ఎక్కిన నాగచైతన్య.. దానిని అలాగే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా కథల ఎంపికల విసయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నాగచైతన్య నటించనున్నారు. దీనికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి.
కాగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శోభిత ధూళిపాళ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే భర్త నాగచైతన్యతో కలిసి హనీమూన్ కంప్లీట్ చేసిన శోభిత ప్రస్తుతం తీర్ధయాత్రల నిమిత్తం తమిళనాడు వెళ్లారు. సోలోగానే అక్కడి పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తున్నారు. కుంభకోణంలోని సారంగపాణి ఆలయంతో పాటు కుంభేశ్వర స్వామి, రామేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. అయితే చైతూ లేకుండా ఒంటరిగా వెళ్లడం ఏంటంటూ కొందరు నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











