Sobhita Dhulipala: శోభిత ధూళిపాలకు చేదు అనుభవం..

అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత అక్కినేని కోడలు బ్రాండ్ ఇమేజ్‌తో ఎంజాయ్ చేస్తున్నారు శోభిత ధూళిపాళ. వివాహం తర్వాత భర్తతో కలిసి విహారయాత్రలలో సేద తీరుతున్నారు శోభిత. కుదిరితే జంటగా లేదంటే ఒంటరిగా అన్ని చుట్టేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా తాను నటిగా కంటిన్య అవుతానని శోభిత ధూళిపాళ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అక్కినేని వారి కోడలు. ఈ క్రమంలో ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే.

తిరుమలలో సందడి
ఇటీవల భర్త నాగచైతన్యతో కలిసి శోభిత తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి వీరిద్దరూ సందడి చేశాడు. చైతూ పట్టు పంచెలో.. శోభిత ఎరుపు, బంగారు వర్ణం కలగలిపిన పట్టు చీరలో ఆకట్టుకున్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు ఈ దంపతలకు స్వామి ఫోటోను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయం నుంచి బయటికి వస్తూ అభిమానులు, మీడియా ప్రతినిధులు చుట్టుముట్టడంతో తన భార్య చేతిని పట్టుకుని ముందుకు నడిపించారు నాగచైతన్య. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akkineni Naga Chaitanya s wife Sobhita Dhulipala reveals she was replaced by a dog for a shoot

శోభిత ప్రెగ్నెన్సీపై రూమర్స్
పెళ్లయి దాదాపు 9 నెలలు కావొస్తుండగా ఈ జంట ఎప్పుడు శుభవార్త చెబుతుందా అని అభిమానులు, సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. శోభితలు గర్భం దాల్చినట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్‌గా వేవ్స్ సమ్మిట్‌కు తన భర్త నాగచైతన్యతో కలిసి వెళ్లిన శోభిత చీరకట్టులో అదిరిపోయింది. ఆ సమయంలో తన కడుపు భాగాన్ని కవర్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించడంతో శోభిత తీరు హాట్ టాపిక్‌గా మారింది.

శోభిత టీమ్ క్లారిటీ
దాంతో శోభిత గర్భం దాల్చారని మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీటిని అక్కినేని ఫ్యామిలీ కానీ, శోభిత ఫ్యామిలీ కానీ ఖండించకపోవడంతో వీటికి మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో శోభిత పీఆర్ టీమ్ స్పందించింది. శోభిత - నాగచైతన్య దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని, ఇప్పట్లో గర్భం దాల్చడంపై ఇంకా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. దాంతో అక్కినేని అభిమానులు నీరసపడిపోయారు.

కష్టాలతో హల్ చల్
ఇప్పుడంటే అక్కినేని వారింటికి కోడలిగా, స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న శోభితకు ఈ హోదా, ఈ ఫేమ్ అంత తేలికగా రాలేదు. తాను ఎన్నో కష్టాలు, అవమానాలు అనుభవించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఓ కంపెనీ వాళ్లు తనకు అర్ధరాత్రి ఫోన్ చేసి ఆడిషన్ ఉందని చెప్పారని.. నాకు తొలుత ఆశ్చర్యపోయినా.. అవకాశం పొగొట్టుకోకూడదని వాళ్లు చెప్పిన ప్లేస్‌కు వెళ్లానని శోభిత చెప్పింది. తన పర్ఫార్మెన్స్ నచ్చి.. వారు సెలెక్ట్ చేయగా, యాడ్ షూటింగ్ నిమిత్తం గోవాకు వెళ్లామని శోభిత పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక అంతా బాగానే జరుగుతున్నట్లుగా అనిపించింది.. తొలి రోజు తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరు చెప్పి తర్వాత షూటింగ్ చేద్దామని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.

శోభిత ప్లేస్ లో కుక్క
ఓ రోజు సెట్‌కు వెళ్లగా.. ఈ అమ్మాయి బిహేవియర్, స్ట్రెంత్ మన బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోదని అంత కాన్ఫిడెంట్‌గా ఉండే అమ్మాయి సెట్ కాదని మాట్లాడుకోవడం నా చెవిన పడిందని శోభిత తెలిపారు. ఆ తర్వాత తన స్థానంలో ఓ కుక్కని తీసుకొచ్చారని.. అలాగే ఒకరోజు పనిచేసినందుకు నాకు రెమ్యునరేషన్ ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శోభిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X