Rashmika Mandanna: రష్మిక ఖాతాలో 3000 కోట్లు.. టాప్ సీక్రెట్ లీక్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో

నటీనటుల ఆస్తులు, సంపద గురించి ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ వంటి సంస్థలు తరచుగా నటీనటుల ఆస్తులు, ఇతర వివరాలను బహిర్గతం చేస్తుంటాయి. ఏ ఇండస్ట్రీలో ఎవరు టాప్? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? వంటి వివరాలు బయటికొస్తుంటాయి. అవి చూసి ఆయా హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో 3 వేల కోట్లు ఉన్నాయంటూ ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

పేదరికం అనుభవించిన రష్మిక
కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో పుట్టిన రష్మిక మందన్న ఒకప్పుడు పేదరికం అనుభవించారు. తండ్రి ఎంత కష్టపడుతున్నా అది అవసరాలకు సరిపోక ఎంతో ఇబ్బందిపడే వాళ్లమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు స్టార్ హోటల్‌లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవని, తాను ఆడుకోవడానికి కనీసం బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్ధితిని తన తల్లిదండ్రులు అనుభవించారని రష్మిక వెల్లడించింది. అందుకే తాము డబ్బుకు ఎంతో విలువ, గౌరవం ఇస్తామని ఆమె వెల్లడించింది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో చదువుకున్న రష్మిక అనంతరం సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు.

Akkineni Nagarjuna Praises Rashmika Mandanna At Kuberaa Event

నేషనల్ క్రష్‌గా రష్మిక
కిర్రాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టి శాండల్‌వుడ్ నుంచి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్‌ను ఏలుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. చలో చిత్రంతో తెలుగువారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో బలంగా జెండా పాతారు. ఈ దశలో పుష్ప సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీవల్లిగా చిత్తూరు జిల్లా యాసలో రష్మిక అద్భుతంగా నటించారు. టాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో అవకాశం అందుకున్నారు రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్‌ నటించి మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

3000 కోట్ల ప్రాజెక్ట్స్‌లో రష్మిక
ఇక మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆథారంగా తెరకెక్కిన ఛావాలో రాణి యేసుబాయిగా చారిత్రక పాత్రలో ఒదిగిపోయారు. దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం చరిత్రను తిరగరాసింది. అలా పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వెంట వెంటనే బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో నటించిన రికార్డు సొంతం చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాల వసూళ్లు అన్నీ కలిపి ఏకంగా రూ.3000 కోట్ల పైమాటే ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని గుర్తుచేస్తూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున.. రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు.

Take a Poll

రష్మికపై నాగ్ ప్రశంసలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన చిత్రం కుబేర. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.. రష్మిక గడిచిన మూడేళ్లుగా సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. మేము చేయలేని 2 వేల కోట్లు, 3 వేల కోట్ల సినిమాలు చేసి మమ్మల్ని దాటేసిందని నాగ్ కొనియాడారు. మేం చేయలేని సినిమాలు కేవలం రష్మిక మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు రష్మిక మెలికలు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X